జాతీయ వార్తలు

సైన్యంలోకి రోబోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: జమ్ముకాశ్మీర్‌లో హింసాకాండను ఎదుర్కొవటానికి భారత సైన్యంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రోబోలను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఉగ్రవాదులతో సమర్థంగా పోరాడటానికి 544 రోబోలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు ఇటీవలే ఆమోదం లభించింది. ‘మేక్’ కేటగిరీ కింది 2016లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ‘జమ్ము కాశ్మీర్‌లో ఎదురవుతున్న పరిస్థితి సాధారణమైంది కాదు. రాష్ట్రీయ రైఫిల్స్‌కు సున్నితమైన ప్రాంతాల్లో ముప్పు ఎదురవుతోంది’ అని ఆర్మీ నివేదికలో పేర్కొన్నారు. ఆర్మీ నివేదిక ప్రకారం మొదటి యూనిట్‌లో పాటే రెండో యూనిట్‌ను కూడా రిమోట్‌తో ఒకే ఆపరేటర్ నిర్వహిస్తాడు. ఈ రిమోట్‌కు రెండు డిస్ప్లే స్క్రీన్‌లు ఉంటాయి. తక్కువ బరువుండే ఈ రోబోలకు నిఘా కెమెరాలు ఉంటాయి. 200 మీటర్ల దూరం వరకూ కెమెరాలు స్పష్టమైన చిత్రాలను తీయగలుగుతాయి. ఐఈడి పేలుడు పదార్థాలను గుర్తించేందుకు రిమోట్‌తో ఆపరేట్ చేసే వాహనాన్ని ఇటీవలే సైన్యంలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.