జాతీయ వార్తలు

ముఖ్యమంత్రి, వైద్య మంత్రి రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల మృతికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. లిక్విడ్ ఆక్సిజన్ కొరత కారణంగా చిన్నారుల మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతంలో రెండు కోణాలు ఉన్నాయని, సంఘటనకు బాధ్యులైన ఆస్పత్రి పాలనా యంత్రాంగం, ఆక్సిజన్ సప్లైదారు, ఆస్పత్రిపై పర్యవేక్షించాల్సిన జిల్లా పాలనా యంత్రాంగం తప్పిదం మొదటిది కాగా, ముఖ్యమంత్రి నైతిక బాధ్యత రెండవదని తివారీ అన్నారు. మిగతా అందరిపైన హత్యా నేరం కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని ఆయన అన్నారు.