జాతీయ వార్తలు

వికాస్‌కు 14రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 12: ఓ ఐఎఎస్ అధికారి కుమార్తెను కారులో వెంటాడి, కిడ్నాప్‌కు ప్రయత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్ బారాల కొడుకు వికాస్‌ను ఈ నెల 25 వరకూ జుడీషియల్ కస్టడీకి పంపారు. వికాస్ స్నేహితుడు అశీష్ కుమార్‌నూ జుడీషియల్ కస్టడీ విధిస్తూ డ్యూటీ మెజిస్ట్రేట్ గౌరవ్ దత్తా ఆదేశించారు. భారీ భద్రత మధ్య నిందితులిద్దర్నీ శనివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వికాస్, కుమార్ ఇద్దరికీ 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్టు డిఫెన్స్ కౌన్సిల్ సూర్యప్రకాష్ వెల్లడించారు. ఇంతకుముందు ఇద్దర్నీ శనివారం వరకూ పోలీసు రిమాండ్ విధించారు. ఐపిసిలోని సెక్షన్ 365, 511 కింద ఇద్దరినీ ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేశారు. తాము ఎలాంటి నేరం చేయలేదని అంతా మీడియా సృష్టేనంటూ వికాస్ (23), కుమార్ (27) ఆరోపించారు. ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్న పోలీసులు గతవారం నిందితులు ఇద్దర్నీ బెయిల్‌పై విడుదల చేసింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో పలువురు ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి మద్దతుగా గళం విప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.