జాతీయ వార్తలు

ఏడుగురు మంత్రుల రిటైర్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, చౌదరీ బీరేం ద్ర సింగ్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, ముక్తార్ అబ్బాస్ నఖ్వితోపాటు దేశానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టిన విజయ్ మాల్యా పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. వెంకయ్య ఈసారి మధ్యప్రదేశ్ నుండి నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికవుతున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హర్యానా నుండి రాజ్యసభకు ఎన్నికైన సురేష్ ప్రభు ఈసారి అక్కడి నుండే ఎన్నికవుతారా లేక మహారాష్ట్ర నుండి రాజ్యసభకు వస్తారా అనేది వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికా సోని, ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేష్, మోహిసినా కిద్వాయి, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ, సుదర్శన్ నాచియప్పన్, ప్రముఖ పత్రికాధిపతి విజయ్ దర్దా, ఎన్‌సిపి సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్, బిజెపి నాయకుల్లో ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ, చందన్ మిత్రా, తరుణ్ విజయ్, బిఎస్‌పి సీనియర్ నాయకుడు సతీష్ చంద్ర మిశ్రా, జెడి(యు) సీనియర్ నాయకుడు కె.సి.త్యాగి, శరద్ యాదవ్ తదితరులు రిటైర్ అవుతున్నారు. శరద్ యాదవ్ బిహార్ నుండి మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంబికా సోని మళ్లీ పంజాబ్ నుండి ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ న్యాయవాది రాం జేత్మలానీ మాత్రం మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కాలేని పరిస్థితి. ప్రస్తుతం రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనంద్ శర్మ ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.