జాతీయ వార్తలు

స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలక్కడ్, ఆగస్టు 15: కేరళలో అధికార సిపిఎం సారథ్యంలోని ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మంగళవారం ఇక్కడ ఓ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ స్వాతంత్య్రం కోసం సర్వాన్ని త్యాగం చేసిన వారి ఆశయాలను, ఆదర్శాలను అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం అన్నవి అత్యంత పవిత్రమైనవని, వాటిని త్రికరణశుద్ధిగా పరిరక్షించుకోవాలన్నారు. భగవత్ జెండా ఎగురవేసిన కర్నాగ్ అమ్మాన్ పాఠశాల ప్రభుత్వ సాయంతో నడుస్తోంది కాబట్టి అక్కడ జాతీయ పతాకాన్ని ప్రజా ప్రతినిధులు లేదా స్కూలు అధికారులు మాత్రమే ఎగురవేయాలని పలక్కాడ్ జిల్లా కలెక్టర్ మేరీ కుట్టీ సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. దాన్ని ఉల్లంఘించిన భగవత్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం గమనార్హం.