జాతీయ వార్తలు

దేశభక్తిని మేళవించిన ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భిన్నత్వంలో ఏకత్వ భావన, దేశ భక్తి దేశవ్యాప్తంగా వెల్లివిరిసింది. భారత దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఓ పండువగా దేశ ప్రజలందరూ మంగళవారం జరుపుకొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఉత్సవ, ఉత్సాహా వాతావరణం నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు. తమ రాష్ట్రాలను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రేకెత్తించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ఆమె 35ఏ అధికరణను ప్రస్తావించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ మరింత ముందుకు తీసుకెళ్లానని ఉద్ఘాటించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశానికి స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు అయినా ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి చెందడం విచారకమన్నారు. ఢిల్లీలో డెంగ్యూ, చికున్ గునియా వ్యాధులను 10 రోజుల్లో అరికడతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తానని ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. రాష్ట్రంలో రుణవిమోచన పథకాన్ని నెలరోజుల్లో అమలు చేస్తానని పంజాబ్ సిఎం అమరేందర్‌సింగ్ హామీ ఇచ్చారు. 2019 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆవాసాన్ని కల్పిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో అవినీతిని, పేదరికాన్ని లేకుండా చేస్తానని మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిజ్ఞచేశారు. రాష్ట్రంలో వరద బాధితులు అన్ని విధాలుగా ఆదుకుంటామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఊరేగింపులు, పరేడ్‌లు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మమతాబెనర్జీ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించింది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రసంగిస్తున్న సందర్భంలోనే ఒడిశా సిఎం నవీన్‌పట్నాయక్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు.వందన స్వీకారం జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏ రాష్ట్రంపైనా అన్యభాషను రుద్దడానికి వీల్లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ప్రజాస్వామ్య పరిధిలో భిన్న భాషలు, భిన్న వర్గాలు కలిసి కట్టుగా కొనసాగితేనే భారత్ కొత్త శక్తిని పుంజుకుంటుందని తెలిపారు.

చిత్రాలు.. అహ్మదాబాద్‌లోని ఓ బ్రిడ్జిపై ప్రదర్శించిన
300 మీటర్ల పొడవైన జెండా *సికిందరాబాద్‌లో ఓ చిన్నారి