జాతీయ వార్తలు

సవాళ్లపై సమరభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: సముద్రాల్లోనైనా, సరిహద్దుల్లోనైనా ఎక్కడ ఏ రకమైన భద్రతాపరమైన సవాలు ఎదురైనా దాన్ని దీటుగా ఎదుర్కొని తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనాతో డోక్లామ్‌పై కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యత చేకూరింది. ఇటు చైనా ధోరణిని గానీ, గత రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లామ్ వివాదాన్ని గానీ ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా మాట్లాడిన మోదీ దేశ భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత కీలకమని ప్రకటించారు. సరిహద్దులను తిరుగులేని రీతిలో కాపాడుకునేందుకు సైనికులు నిరంతరం అప్రమత్తతతో పనిచేస్తున్నారన్నారు. ఆధీనరేఖ ప్రాంతంలో గత ఏడాది భారత దళాలు జరిపిన లక్షిత దాడులను ప్రస్తావించిన మోదీ ‘ఆ దాడితో భారత భద్రతా దళాల శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచ దేశాలకు తెలిశాయి’ అని గుర్తుచేశారు. అంతర్గత భద్రతను మరింత ప్రాధాన్యతతో పరిరక్షించుకుంటామని, సముద్ర వివాదాలైనా, సరిహద్దుల సమస్యలైనా, సైబర్ సవాళ్లయినా, అంతరిక్ష సమస్యలైనా, అన్నింటినీ ఎదుర్కోగల పాటవం భారత్‌కు ఉందని తెలిపారు. భద్రతాపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా, సవాలునైనా తిప్పికొట్టగలుగుతామని తెలిపారు. ఎప్పుడైతే సైనికులు, నౌకాదళ, వైమానిక దళాలు తమ శక్తిని అనేక సందర్భాల్లో చాటిచెప్పాయని గుర్తుచేసిన మోదీ భారత జవాన్లు త్యాగాలకు ఎప్పుడూ వెనుకాడలేదని అన్నారు. అలాగే వామపక్ష ఉగ్రవాదం, తీవ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లను ఎదుర్కోవడంతో పాటు దేశంలో అలజడిని సృష్టించే అరాచక మూకలను కూడా భారత జవాన్లు అణచివేయగలిగారని మోదీ గుర్తుచేశారు. ఇలాంటి సమయాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉగ్రవాదం పట్లగానీ, ఉగ్రవాదులపైగానీ మెతక వైఖరి ఉండదని తెగేసి చెప్పిన మోదీ ఈ జాడ్యాన్ని వదిలించేందుకు తమ ప్రభుత్వం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందన్నారు. జాతీయ జనజీవన స్రవంతిలో కలవాలని, ఆయుధాలను విసర్జించాలని ఉగ్రవాదులకు పిలుపునిచ్చామని గుర్తుచేసిన మోదీ ‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్న విషయాన్ని వారికి అనేక సందర్భాల్లో స్పష్టం చేశాం’ అని తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి మద్దతు లభిస్తోందని మోదీ తెలిపారు. ఎక్కడ హవాలా లావాదేవీలు జరిగినా ఆ సమాచారం భారత్‌కు అందుతోందని, అలాగే ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అనేక దేశాలనుంచి సమాచారాన్ని అందుకుంటున్నామని అన్నారు. ఈ విధంగా శాంతియుత పరిస్థితుల సంస్థాపనకు భారత్‌కు అనేక రకాలుగా సాయపడుతున్న దేశాలన్నింటికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం ఎంతగానో కృషి చేసిన భద్రతా సిబ్బంది వివరాలను అందించేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ పథకాన్ని తమ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన ‘గత నలభై సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. దాన్ని మా ప్రభుత్వం అమలులోకి తీసుకురాగలిగింది’ అని వెల్లడించారు. సైనికుల డిమాండ్లను, వారి ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరిస్తే సైనిక దళాలు దేశం కోసం కష్టపడగలుగుతాయని ఆ విధంగా దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని తెలిపారు.