జాతీయ వార్తలు

అవినీతిని పెకిలించేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అవినీతి వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో అవినీతి వ్యవస్థీకృతమైందన్న మోదీ, సామాన్యుడి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు. గురువారం జరిగిన ‘పరివర్తనా విజేతలు’ కార్యక్రమంలో ఔత్సాహిక స్టార్టప్ పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ‘మా ప్రభుత్వం దళారీ వ్యవస్థకు చరమగీతం పాడింది. గ్రూప్ 3, 5 ఉద్యోగాలను ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేస్తోంది’ అన్నారు. ప్రత్యామ్నాయంగా సంస్థాగత ఏర్పాట్లు చేయకుండా వ్యవస్థీకృత అవినీతిని అంతం చేయడం సాధ్యమైందని ఉద్ఘాటించారు. పనుల్లేని దళారులే ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై కేకలు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ప్రధాని, ప్రతి భారత పౌరుడు చేయూతనిస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వినూత్న రీతిలో ఆలోచించాలని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సూచించాలని పిలుపునిచ్చారు. పరివర్తనా విజేతలనే ఈ కార్యక్రమాన్ని వార్షికంగా నిర్వహిస్తే బావుటుందని ఈ ప్రసంగంలో సూచించారు. పద్మ అవార్డులను గతంలో మంత్రుల సిఫార్సులపై ఇచ్చేవారని, అవార్డు ఎవరికి ఇవ్వాలో ప్రజలే సిఫార్సు చేసేలా మార్పులు చేశామన్నారు. నవభారత నిర్మాణంలో దేశ ప్రజలందరితో కలిసి పనిచేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మోదీ ‘మనమంతా దేశం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని కోరుకునేవాళ్లమే. దేశం పట్ల మనకున్న ప్రేమలో ఎలాంటి తేడా ఉండద’ని మోదీ అన్నారు.