జాతీయ వార్తలు

జయ మరణంపై జ్యుడీషియల్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 17: తమిళనాడు మాజీ సిఎం జయలలిత మరణంపై ముసిరిన అనుమానాల నిగ్గు తేల్చేందుకు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. జయ మరణం దర్యాప్తు జరిపి తీరాలంటూ మాజీ సిఎం పన్నీర్ సెల్వం డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో సిఎం పళని స్వామి మాట్లాడుతూ చెన్నైలోని జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్‌ను స్మారక కేంద్రంగా మారుస్తున్నామన్నారు. జయ మరణంపై దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌తోపాటు అన్నాడిఎంకె చీలక వర్గాల విలీనానికి పన్నీర్ సెల్వం షరతులు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ రెండు వర్గాలు ఏకమయ్యేందుకు మార్గం సగమమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తన్నారు. ఇదిలావుండగా జయ మరణంపై దర్యాప్తు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అపోలో ఆస్పత్రి హర్షించింది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన నిరాధార ఊహాగానాలకు తెరపడుతుందని ఆస్పత్రి వర్గాలు వ్యాఖ్యానించాయి.