జాతీయ వార్తలు

ప్రతిభే కొలమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: తెలంగాణ విద్యుత్ సంస్థ ఏఇల నియామకంలో మిగిలిపోయిన 239 పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు అదేశించింది. 4 విద్యుత్ సంస్థల్లో ఖాళీగావున్న ఉద్యోగాలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేకుండ, గతంలో నిర్వహించిన పరీక్షల మెరిట్ లిస్టు ఆధారంగా భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ కేసులో గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత కోర్టు తోసిపుచ్చింది. విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్లు నియామకం కోసం 2015 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ (164), టీఎస్‌జెన్‌కో (856), టీఎస్‌ఎస్‌పీడీఎల్ (201), టీఎస్ ట్రాన్స్‌కో (206) వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించాయి. దీనికి సంబంధించి అభ్యర్థులు దాదాపు నాలుగు సంస్థల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 239మంది అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ సంస్థల్లో అర్హత సాధించారు. దీంతో ఆమేరకు విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత తగా నోటిఫికేషన్ జారీ చేసింది. సర్కారు నిర్ణయంపై కొద్దిమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 1997 జీవో 81 ప్రకారం ఒక్క సీటుకు 1:1 పిలవాలని, కాబట్టి మిగిలిపోయిన స్థానాలకు తాజా నోటిఫికేషన్ వెలువరించి మళ్లీ కొత్త నియామకం చేపట్టాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి హైకోర్టు పిటిషన్ దారులకు అనుకూలంగా ఆదేశాల జారీ చేసింది. దీంతో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ముంజ ప్రవీణ్, శ్రీధర్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పిటిషనర్ల తరఫున సినియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషన్, కొలిన్ గుంజాల్‌వేస్, శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపించారు. దీనికి సంబధించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోని జస్టిస్ మధన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. జీవో నెం.81 1997ను ఉమ్మడి హైకోర్టు అపార్థం చేసుకుందని ధర్మాసనం పేర్కొంది. పైగా ఉమ్మడి హైకోర్టు ఏపీ ప్రభుత్వం వర్సెస్ భాగం దోరసానమ్మ కేసులో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ధర్మాసనం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నాలగు విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.