జాతీయ వార్తలు

స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 17: భారత దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ పాత్రను సక్రమంగా నిర్వచించడంకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు.
‘స్వాతంత్య్ర పోరాట చరిత్రను సక్రమంగా రాయలేదు. అందులో అనేక వక్రీకరణలున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్రను సక్రమంగా చూపించలేదని మేము భావిస్తున్నాం. భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఇప్పటివరకు ప్రచురించిన కథనాల్లో లోపాలను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్ది, సక్రమంగా ఆధారాలతో రూపొందించాలని మేము భావిస్తున్నాం’ అని నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ గురువారం ఇక్కడ విలేఖరులతో అన్నారు.
నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావడానికి దానికి సంబంధించిన అన్ని వాదనలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ బిజెపి విభాగం ఉపాధ్యక్షుడు కూడా అయిన బోస్ అన్నారు. నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని వెలుగులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించి విడుదల చేసిన అన్ని డాక్యుమెంట్లను లోతుగా విశే్లషించి ఒక నివేదికను రూపొందించడానికి ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆ నివేదికను పార్లమెంటు ముందుంచాలని తామంతా అభిప్రాయ పడుతున్నామని బోస్ చెప్పారు. విలేఖరుల సమావేశంలో నేతాజీ కుటుంబ సభ్యులు చిత్రాఘోష్, అనిజిత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.