జాతీయ వార్తలు

ఉపాధిలో మేటి ఖనిజరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మన దేశ జిడిపిలో ఖనిజ రంగం 2.6 శాతం వాటాను అందిస్తోందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. గురువారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2013-14 సంవత్సరానికిగాను గనుల విభాగాలలో భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ఖనిజ రంగం ప్రతి రోజు సగటున ఒక మిలియన్ కంటే ఎక్కువ మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోందని అన్నారు. ఖనిజ రంగం నూతన టెక్నాలజీలను ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలను సాధిస్తోందని, అలాగే తవ్వకాల పరిశ్రమలో విప్లవత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ భద్రతా అవార్డులను ఔత్సహికులకు ఇవ్వడంద్వారా కార్మికుల భద్రత మరియు సంక్షేమ ప్రమాణాలను పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. భద్రత ప్రమాణాలపై విద్యార్థులకు పరిచయ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం ఏడు విభాగాల్లో ఈ అవార్డులను కేంద్ర కార్మిక శాఖ అందజేసింది. ఆయిల్ మైన్స్ విభాగంలో కృష్ణా-గోదావరి డ్రిల్లింగ్ మైన్ అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సేఫ్టీ అవార్డును దక్కించుకుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..కృష్ణా-గోదావరి డ్రిల్లింగ్ మైన్ అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులకు అవార్డును అందజేస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ