జాతీయ వార్తలు

చివరి క్షణంలో చిక్కుముడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 18: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు ఏకమవడం ఖాయమనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నప్పటికీ కొన్ని చిక్కుముడులు ఈ విషయంలో ముందు కు సాగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఇ.పళని స్వామి మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కూడా తన మద్దతుదారులతో భేటీ అయి విలీనంపై చర్చించడంతో సాయంత్రం మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఇరువర్గాలు విలీనంపై అధికారికంగా ఒక ప్రకటన చేస్తాయన్న ఊహాగానాలు బలంగా వినిపించ సాగాయి. పెద్ద సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు సైతం సాయంత్రానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. అయితే కొద్దిసేపటికే వచ్చిన నేతలంతా ఒక్కరొక్కరుగా జారుకోవడంతో విలీనం చర్చల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యాయనే విషయం స్పష్టం అయింది. కొన్ని అనుకోని చిక్కులు ఎదురయ్యేయని, ఇరువర్గాలు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆ చిక్కులేమిటో వారు వివరించలేదు.
శుక్రవారం ఉదయం పన్నీర్ సెల్వం వర్గం నాలుగు గంటల పాటు మంతనాలు సాగించగా, ముఖ్యమంత్రి పళనిస్వామి మంత్రివర్గ సహచరులతో పాటు పార్టీకి చెందిన ప్రముఖ నేతలతో సుదీర్ఘంగానే చర్చలు జరిపారు. సమస్యల కారణంగా చర్చలు అనుకొన్న దానికన్నా ఎక్కువ సమయం కొనసాగడంతో ఈ రోజు రాత్రి అనుకున్నట్లుగా విలీనంపై ప్రకటన వెలువడ లేదు. నిజానికి విలీనంపై ప్రకటన వెలువడుతుందన్న అంచనాలతో జయలలిత సమాధి ప్రాంతాన్ని పూలతో అలంకరించగా, నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం విద్యుద్దీప కాంతులతో వెలిగి పోతూ కనిపించింది. జయలలిత సమాధి వద్దకు చేరుకున్న వందలాది పార్టీ నేతల చేతుల్లో పూలదండలు కూడా కనిపించాయి. అంతేకాదు రాత్రి పొద్దుపోయాక పళనిస్వామి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతారని అందరూ భావించగా, చివరికి అది కూడా వాయిదా పడింది.
చిన్నమ్మతో దినకరన్ భేటీ
ఓ వైపు అన్నాడిఎంకెలోని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమవుతాయన్న వార్తలు వెలువడుతుండగా, మరోవైపు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టిటివి దినకరన్ శనివారం బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను కలిశారు. పార్టీనుంచి తమను వెలివేసి ఈ రెండువర్గాలు విలీనం అవుతున్న నేపథ్యంలో తమ వర్గం భవిష్యత్తు కార్యాచరణను చర్చించడం కోసమే దినకరన్ ‘చిన్నమ్మ’తో సమావేశమైనట్లు తెలుస్తోంది.

చిత్రం..అమ్మ సమాధి సాక్షిగా పళని, పన్నీర్ వర్గాలు ఏకమవుతున్నాయన్న వార్తతో జోరువానను కూడా లెక్కచేయకుండా మెరీనా బీచ్‌కు చేరుకున్న అన్నాడిఎంకె శ్రేణులు.