జాతీయ వార్తలు

గుజ్జర్ల రిజర్వేషన్ల కోసం ఒబిసి కోటా 26 శాతానికి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 18: గుజ్జర్లు, ఇతర కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఒబిసిల కోటాను ఇప్పుడున్న 21 శాతంనుంచి 26 శాతానికి పెంచనుంది. గురువారం రాత్రి గుజ్జర్ల ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒక ఏకాభిప్రాయం కుదరడంతోవచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఒబిసి కోటాను 26 శాతానికి పెంచిన తర్వాత ఈ కోటాను వర్గీకరించడం జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం గుజ్జర్ల నేతలకు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్లు 49 శాతం ఉన్నాయి. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే న్యాయపరంగా ఉండాల్సిన 50 శాతంకన్నా ఎక్కువ అవుతుంది. గత రాత్రి పలు దఫాల చర్చల అనంతరం ఓబిసి కోటాను 21 శాతంనుంచి 26 శాతానికి పెంచాలనే నిర్ణయానికి రావడం జరిగింది గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఒబిసి కోటా పరిధిలోనే ‘వెనుకబడిన’, ‘అత్యంత వెనుకబడిన’ లేదా ఎ కేటగిరీ, బి కేటగిరీ అంటూ వర్గీకరణ ఉంటుందని రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది శుక్రవారం పిటిఐకి చెప్పారు. న్యాయపరమైన సీలింగ్‌కు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించడం జరుగుతుందని, వారి సలహా ప్రకారమే బిల్లు ముసాయిదాను రూపొందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెడతామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడుగా చర్చల్లో పాల్గొన్న చతుర్వేది తెలిపారు. సమావేశం అనంతరం కిరోరి సింగ్ బైన్సాలా నేతృత్వంలో గుజ్జర్ల ప్రతినిధి బృందం, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రి వసుంధరా రాజెను ఆమె నివాసంలో కలిశారు. గుజ్జర్లు, మరో నాలుగు కులాల వారిని తిరిగి ఒబిసి జాబితాలో చేరుస్తూ ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.