జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన ఉత్కళ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌నగర్, ఆగస్టు 19: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది మృతి చెందారు. 80మందికిపైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం కథౌలీ ప్రాంతంలో హైస్పీడ్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అతి వేగంగా వెళ్తుండటంతో దాదాపు 14బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపై ఒకటి ఎక్కేసాయి. ట్రాక్ పక్కనే ఉన్న ఓ ఇంటిపై బోగీలు పడటంతో ఇల్లు ధ్వంసమైంది. ముజఫర్ నగర్ నుంచి బయలు దేరిన రైలు అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో కథౌలీ దగ్గరకు సాయంత్రం 5.30గంటలకు చేరుకున్న సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ఒడిషా లోని పూరి నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వరకు 36గంటల పాటు ప్రయాణిస్తుంది. అతి వేగంగా బోగీలు ఒకదానితో ఒకటి ఢీకొని తునాతునకలు కావటంతో మృతుల సంఖ్య ఎంతన్నది స్పష్టంగా తెలియరాలేదు. బోగీ శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, పిఏసి, ఏటిఎస్ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోలీసు జాగిలాలను కూడా రప్పించారు. ఓ వైపు
వర్షం కురుస్తున్నప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని స్థానిక ప్రయివేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బోగీలను పక్కకు తొలగించేందుకు భారీ క్రేన్లను, గ్యాస్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని సహాయ చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఒక బోగీ పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొట్టింది. ఇంటి శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చని ముజఫర్‌నగర్ శాంతిభద్రతల ఏడిజి ఆనంద్ కుమార్ అన్నారు. రైలు ప్రమాదానికి కుట్రకోణం ఏదైనా ఉందా అన్న అంశంపై విచారించటానికి ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించింది. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్1 నుంచి ఎస్ 10 స్లీపర్ కోచ్‌లు, థర్డ్ ఏసి బి1, సెకండ్ ఏసి ఏ1, పాంట్రీ బోగీలు ధ్వంసం అయ్యాయి. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు ముజఫర్‌నగర్ అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
రాష్టప్రతి, మోదీ సంతాపం
ఈ ఘటన పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పరిస్థితిని సమీక్షిస్తున్న సురేశ్ ప్రభు
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆయన ఆదేశించారు. లోపం ఎవరిదైనా వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మృతుల కుటంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు పరిహారాన్ని అందజేస్తున్నట్లు రైల్వే శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఆయనతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ కూడా కథౌలీకి బయలు దేరారు. ‘గాయపడిన వారిని రక్షించి, త్వరగా స్వాంతన చేకూర్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో రైల్వే శాఖ సమన్వయం చేసుకుంటూ సహాయ చర్యలను వేగవంతం చేశాం.’ అని సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. ‘మొదట్లో అయిదు కోచ్‌లే పట్టాలు తప్పాయని భావించాం. కానీ మొత్తం 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనిల్ సక్సేనా అన్నారు. కాగా, ఈ రూట్‌లో పలు రైళ్లను దారి మళ్లించగా, ఇంకొన్ని రైళ్లను రద్దు చేశారు.

చిత్రం..ప్రమాదంలో నుజ్జునుజ్జయన ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు