జాతీయ వార్తలు

మతమార్పిడులపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: కేరళలో జరుగుతున్న మత మార్పిడులపై రాష్ట్రప్రభుత్వం నివేదిక కోరామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హన్సరాజ్ పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ మత మార్పిడులపై సమగ్ర దర్యాప్తునకు ఎన్‌ఐఎను ఆదేశించామని, ఎన్‌ఐఎ నివేదిక వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయని, అయితే తాము రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక పంపమని మరో మారు కోరినా, ఫలితం లేకపోయిందని చెప్పారు. త్వరలో ఆ నివేదిక వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మలప్పురం జిల్లాలో ఒక పెద్ద కేంద్రం ఉందని, ఆ కేంద్రంలో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. కొద్దిరోజుల్లోనే వెయ్యిమంది మతమార్పిడి చేసుకున్నారు, హిందువులు, క్రైస్తవులు సైతం ముస్లింలుగా మారారని ఆయన వివరించారు. గత మే నెలలో తాను కేరళ వెళ్లానని, అక్కడ డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ చర్చించానని అన్నారు. పేదరికం వల్ల అలా జరుగుతోందా లేదా భయంతో మారుతున్నారా లేక ఉపాధి కోసమా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తాను చెప్పానని అన్నారు. లవ్ జిహాద్ అంశంపై ప్రశ్నించగా, ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టులో ఉందని, దానిపై మాట్లాడటం సరికాదని చెప్పారు. కేరళలో ఏం జరుగుతుందో మొత్తం విషయాలు అన్నీ వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు.