జాతీయ వార్తలు

అది ప్రభుత్వం తప్పిదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, ఆగస్టు 19: గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పెద్ద సంఖ్యలో చిన్నారుల మరణానికి ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఇంతకుముందు కూడా బిఆర్‌డి ఆస్పత్రిని సందర్శించానని, చాలా కొరతలున్నందున ఆస్పత్రికి నిధులు అవసరమని మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పానని, అయితే ఎలాంటి చర్యా తీసుకోలేదని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపైన రాహుల్ విమర్శలు కురిపించారు. ‘మోదీజీ నవ భారతం గురించి మాట్లాడుతారు. ఇలాంటి నవ భారతం మాకు అక్కర లేదు. పేద ప్రజలు తమ చిన్నారులు ఆస్పత్రులకు తీసుకెళ్లి సంతోషంగా తిరిగి వచ్చే ఆస్పత్రులు మనకు కావాలి’ అని ఆయన చెప్పారు. ఈ సమస్యను హైలైట్ చేసిన మీడియాను ఆయన అభినందించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ తప్పులను కప్పి పుచ్చకుండా ఉండాల్సిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బిఆర్‌డి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగానే చాలామంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోపణలున్నాయి. శనివారం రాహుల్ గాంధీ గోరఖ్‌పూర్‌లో మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘నేను మాట్లాడిన అందరు కూడా తమ చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరతే కారణమని చెప్పారు. చాలామందికి అంబుబ్యాగ్‌లు (కృత్రిమ ఆక్సిజన్ బ్యాగులు) ఇచ్చారని, తాము చాలా గంటలపాటు వాటితో ఆక్సిజన్ పంప్ చేశామని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం తప్పిదంవల్ల జరిగిన మరణాలే’ అని విలేఖరులతో రాహుల్ అన్నారు. ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత, అధికారుల ఉదాసీనతే ఈ మరణాలకు ప్రధాన కారణాలని స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి దీన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నించరాదని, తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవాలని అన్నారు.

చిత్రం..గోరఖ్‌పూర్‌లో మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న రాహుల్