జాతీయ వార్తలు

బిజెపి ముఖ్యమంత్రులతో రేపు అమిత్ షా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వచ్చే లోకసభ ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. అమిత్ షా ఏర్పాటు చేసిన సమావేశానికి పదమూడు మంది బిజెపి ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు హాజరవుతురన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకోవటం ద్వారా భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కార్యచరణ పథకాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యచరణ పథకం అమలులో ముఖ్యమంత్రులు అత్యంత ప్రధాన పాత్ర నిర్వహించాలన్నది అమిత్ షా ఆలోచన. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనతోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాలు, అభివృద్ధిని దేశ ప్రజలకు చూపించటం ద్వారా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలన్నది అమిత్ షా వ్యూహం. అందుకే ఆయన బిజెపి ముఖ్యమంత్రులు అత్యంత సమర్థంగా పని చేయాలని, పథకాలను సకాలంలో పూర్తిచేసి అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. సోమవారం జరిగే ముఖ్యమంత్రుల సమావేశాంలో అమిత్ షా కార్యచరణ పథకాన్ని వారి ముందు పెట్టటంతోపాటు సరైన పద్ధతిలో అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడుతారు. వెనుకబాటుతనం, బీదరికం, అస్తవ్యస్థ వ్యవస్థకు ప్రతీకగా మారిన ఉత్తరప్రదేశ్‌ను దారికి తీసుకురావటంతోపాటు లోక్‌సభ ఎన్నికలనాటికి రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించి చూపించాలని అమిత్ షా ఆలోచిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగితే కేంద్రంలో రెండోసారి అత్యంత సునాయసంగా అధికారంలోకి రాగలుగుతామన్నది ఆయన అభిప్రాయం. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో సుపరిపాలనను ఏర్పాటు చేయటం ద్వారా ప్రజల విశ్వాసం సంపాదించి మద్దతు కూడగట్టాలనుకుంటున్నారు. అందుకే సోమవారం సమావేశంలో ఆయన బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి, ఏవైనా హామీలు అమలులోకి రాని పక్షంలో దానికి గల కారణాలేమిటి? అనేది సమీక్షించనున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పథకాల అమలును కూడా అమిత్ షా సమీక్షించనున్నారు.

చిత్రం..భోపాల్ శనివారం నిర్వహించిన వన మహోత్సవంలో
మొక్కను నాటుతున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా