జాతీయ వార్తలు

ఐఐటిలో పిహెచ్‌డికి 70 వేల ఫెలోషిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 19: దేశంలోని ఐఐటిలు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ (ఐఐఎస్‌సి)లో పిహెచ్‌డిలు చేస్తున్న పరిశోధకులకు కేంద్రం నెలవారీ ఫెలోషిప్‌గా రూ 70 వేల రూపాయలు అందజేస్తుందని కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి కేవల్ కుమార్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్ మొత్తం నెలకు రూ.25 వేలుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రిసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద ఇచ్చే ఈ మొత్తం కారణంగా ప్రస్తుతం పూర్తిగా ఆర్థిక కారణాలతో దేశం వదిలివెళ్తున్న ప్రతిభావంతులు దేశంలోనే ఉంటారని తాము ఆశిస్తున్నామని శర్మ శుక్రవారం ఐఐటి ఖరగ్‌పూర్ 67వ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఫెలోషిప్ అయిదేళ్ల పాటు ఇస్తారని, ఈ ఫెలోషిప్ పొందేవారు ఏ ఇతర ఉద్యోగం చేయడానికి వీలులేదని చెప్పారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం త్వరలోనే లభిస్తుందని, వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఇది ప్రారంభమవుతుందని తాము ఆశిస్తున్నామని శర్మ చెప్పారు.