జాతీయ వార్తలు

అమ్మ ఆత్మే కలిపింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 21: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకెలో గత ఏడు నెలలుగా కొనసాగుతున్న వైరివర్గాల వివాదానికి తెరపడింది. సిఎం పళనిస్వామి, రెబెల్ నేత పన్నీర్ సెల్వం మధ్య కుదిరిన రాజీతో సమస్య పరిష్కారమైంది. షరతులమీద షరతుల చందంగా సాగిన వివాదానికి తెరదించుతూ రెండువర్గాలు సోమవారం విలీనమయ్యాయి. వారాల తరబడి సాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన అన్నాడిఎంకె వర్గాలు, పార్టీ అధినేత శశికళ ఉద్వాసనకూ చర్యలు తీసుకుంటామని తెలిపాయి. తాజా విలీన ఒప్పందంలో భాగంగా మాజీ సిఎం పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే ఆర్థిక మంత్రిగానఊ ఆయన విధులు నిర్వహిస్తారు. ఈ నియామకంతో శశికళ బంధువు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటి దినకరన్‌తోపాటు ఆయన సారధ్యంలోని శిబిరం కూడా నిర్వీర్యమైపోయింది. ఒకరినొకరు అన్నా అని పిలుచుకున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలు రెండువర్గాల విలీనాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. పార్టీ వ్యవహారాలు చూసేందుకు 11మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అందులో ఉండే సభ్యుల పేర్లను తర్వాత ప్రకటిస్తామని పళనిస్వామి ఈ సందర్భంగా తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం, ఆయన సన్నిహితుడు పాండ్యరాజన్ చేత సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా గవర్నర్ విద్యాసాగర్‌రావు పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన పన్నీర్‌సెల్వాన్ని అభినందించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో అభివృద్ధిలో తమిళనాడు కొత్తపుంతలు తొక్కగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి ముందు పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండు వర్గాల విలీన వ్యవహారం ఉత్కంఠ మధ్యసాగింది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సమతూకాన్ని పెంపొందించేందుకు
ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు పన్నీర్‌సెల్వం అంగీకరించారు. అలాగే పార్టీలో పన్నీర్‌సెల్వం సమన్వయ కర్తగా, ముఖ్యమంత్రి పళనిస్వామి సహ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇంతకుముందు రెండు శిబిరాల్లో పనిచేసిన వైద్యలింగం, కెపి మున్నుస్వామిలను ఉప సమన్వయకర్తలుగా నియమించారు. వైరివర్గాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడిఎంకె అధికారిక పార్టీ చిహ్నమైన రెండు ఆకుల గుర్తును మళ్లీ పొందగలమన్న ఆశాభావాన్ని పళనిస్వామి వ్యక్తం చేశారు. ఈ చిహ్నాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి సందోహ వాతావరణం నెలకొంది. ముందుగా పళనిస్వామి తర్వాత పన్నీర్‌సెల్వం చేరుకున్నారు. ఇద్దరికీ పార్టీ కార్యకర్తలు దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. పన్నీర్‌సెల్వం పార్టీ కేంద్రానికి రావడం ఏడు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకుని రెండువర్గాల విలీనానికి సంకేతాలందించారు. 3అమ్మ ఆత్మే రెండువర్గాల వీలీనానికి దోహదం చేసింది. 3నా గుండెలో భారం దిగిపోయింది2 అని హర్షధ్వానాల మధ్య పన్నీర్‌సెల్వం అన్నారు. 3మేము అమ్మ బిడ్డలం. మమ్మల్ని ఎవరూ వేరుచేయలేరు2 అని ఉద్ఘాటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా సర్వసభ్య మండలిని సమావేశ పరుస్తామని పళనిస్వామి వర్గానికి చెందిన వైద్యలింగం తెలిపారు. విలీనానికి పన్నీర్ వర్గం పెట్టిన ప్రధాన షరతు శశికళను తొలగించాలన్నదేనన్న విషయం తెలిసిందే. విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలు జయ, ఎంజి రామచంద్రన్, సిఎన్ అన్నాదురై సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.
శశికళ చేసిన తప్పేమిటి?
ఇదిలాఉండగా, పార్టీ శ్రేణులన్నీ శశికళవైపే ఉన్నాయని దినకరన్ వర్గం తెలిపింది. శశికళను తొలగించాలని అనుకోవడానికి కారణమేమిటని దినకరన్ విధేయురాలు సిఆర్ సరస్వతి ప్రశ్నించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామికి శశికళ చేసిన ద్రోహమేమిటని నిలదీశారు.

చిత్రం..తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుతో పళని, పన్నీర్