జాతీయ వార్తలు

జగన్నాథ ఆలయ భద్రతను సమీక్షించనున్న ఎన్‌ఎస్‌జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఆగస్టు 20: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఉగ్రవాద ముప్పును ప్రతిఘటించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) సిద్ధమవుతోంది. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయ భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎన్‌ఎస్‌జికి చెందిన సీనియర్ అధికారులు త్వరలో పూరీ పట్టణాన్ని సందర్శిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పూరీ పుణ్యక్షేత్రంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసేందుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఒడిశా పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్‌ఎస్‌జి బృందం జగన్నాథ ఆలయాన్ని సందర్శించనుంది. ఎన్‌ఎస్‌జి బృందం ఈ నెల 28వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తుందని, ఉగ్రవాద దాడులను ప్రతిఘటించేందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ ఆలయం లోపల, వెలుపల సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తిస్తుందని ఆ అధికారి వివరించారు. జగన్నాథ ఆలయం దేశంలోని ముఖ్యమైన, సమస్యాత్మకమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణిస్తున్నామని, ఈ ఆలయ భద్రతకు ఒడిశా ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ సరిగా అమలవుతోందా లేదా అనే విషయాన్ని ఎన్‌ఎస్‌జి బృందం పరిశీలిస్తుందని రాష్ట్రానికి పంపిన లేఖలో కేంద్రం పేర్కొందని అధికార వర్గాలు తెలిపాయి.