జాతీయ వార్తలు

అనుమతి లేకుండా పట్టాలపై పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లో శనివారం సాయంత్రం ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక కారణం కావచ్చని రైల్వేశాఖ అనుమానిస్తోంది. రైలు పట్టాలపై అనుమతి లేకుండా ఏవయినా మెయింటెనెన్స్ పనులు చేపట్టారా అనే విషయం దర్యాప్తులో నిర్ధారణ అవుతుందని రైల్వే శాఖ సభ్యుడు (ట్రాఫిక్) మహమ్మద్ జంషెడ్ ఆదివారం ఇక్కడ చెప్పారు. అయితే ప్రమాదం జరిగినచోట పట్టాలపై ఏవయినా పనులు జరిగాయా అనే విషయం స్పష్టం కాలేదని కూడా ఆయన చెప్పారు. ప్రమాదం జరిగినచోట ఏవయినా పనులు జరుగుతున్నాయా, జరుగుతూ ఉంటే నిబంధనలను పాటించారా అనే విషయం దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు. రైల్వే సేఫ్టీ విభాగం కమిషనర్ శైలేష్ కుమార్ పాఠక్ నేతృత్వంలో సోమవారంనుంచి దర్యాప్తు మొదలవుతుందని, ప్రమాదానికి కారణం కుట్రా లేక సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే అంశాలతో పాటుగా అన్ని కోణాలను ఆయన పరిశీలిస్తారని ఖతౌలిలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన జంషెడ్ చెప్పారు. కొంత సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లభించిందని, అలాగే ప్రమాద స్థలాన్ని తాము సందర్శించినప్పుడు రైలు పట్టాలపై మెయింటెన్స్‌కు సంబంధించిన పరికరాలు కనిపించాయని ఆయన చెప్పారు. ఇలాంటి భారీ ప్రమాదాలు జరిగినప్పుడు రైలు బోగీలు ఒకదానిపైకి మరోటి ఎక్కడం, పక్కకు పడిపోవడం లాంటివి జరగడం మామూలేనని, అయితే ఈ సంఘటనలో దాదాపు 200 మీటర్ల రైలు మార్గం పూర్తిగా ధ్వంసమయిందని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి లోపాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

చిత్రం..ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు