జాతీయ వార్తలు

నిండా మునిగిన 3 రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/పాట్నా, ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాల్లో కుండపోత వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సం ఆదివారం కూడా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా ఈ మూడు రాష్ట్రాల్లో వరదల కారణంగా మరో 88 మంది మరణించారు. ఆదివారం వర్షాలు తెరిపివ్వడంతో పశ్చిమ బెంగాల్ కొంతమేర ఊపిరి పీల్చుకుంది. బిహార్‌లో మృతుల సంఖ్య 202 నుంచి 253కు పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో కోటీ 26 లక్షల మంది వరద బీభత్స పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నారు. యూపీలో తాజాగా సంభవించిన వరదల కారణంగా ఆదివారం వరకు 64 మంది మరణించారు. మొత్తం 24 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదల కారణంగా నష్టపోయారు. రాష్ట్రంలో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 69కి చేరుకొందని, 24 జిల్లాలోని 2,523 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా, 20 లక్షలకు పైగా జనం సమస్యలను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర సహాయ, పునరావాస కమిషనర్ కార్యాలయం ఆదివారం తెలియజేసింది. తూర్పు యుపిలోని వరద పీడిత జిల్లాల్లో 39,783 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుని ఉన్నారని, నేపాల్‌నుంచి ప్రవహించే నదుల్లో ప్రవాహం తగ్గకపోవడంతో ఈ ప్రాంతంలో వరద బీభత్సం అలాగే ఉందని ఆ ప్రకటన తెలిపింది. వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, పిఏసి జవాన్లు సహాయ, పునరావాస చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లోని నదులనుంచి భారీ మొత్తంలో నీటిని దిగువకు వదిలిపెట్టడం సహాయ కార్యకలాపాలకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అడ్డంకిగా మారుతోందని జవాన్లు చెప్తున్నారు.

చిత్రం..యూపీలోని సిద్ధారమ్‌నగర్ జిల్లాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులు