జాతీయ వార్తలు

విలీనం తర్వాత పార్టీ పగ్గాలు పన్నీర్‌కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 20: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు విలీనమైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం పార్టీకి నాయకత్వం వహిస్తారని, ప్రస్తుత ముఖ్యమంత్రి కె పళనిస్వామి అలాగే కొనసాగుతారని పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన నాయకుడొకరు ఆదివారం చెప్పారు. అలాగే ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న నేతలను తప్పించకుండా పార్టీలో చోటు కల్పించడానికి శాసనమండలిని పునరుద్ధరించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆ నాయకుడు చెప్పారు. ‘పార్టీ వ్యవహారాలకు సంబంధించి పన్నీర్ సెల్వం నంబర్ వన్‌గా, పళనిస్వామి నంబర్ టూగా ఉంటారు. ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ నాయకుడు చెప్పారు. తమ వర్గంనుంచి ఇద్దరికి మంత్రిపదవులు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. విలీనానికి అన్నాడిఎంకెలోని ఇరు వర్గాలు ఆమోదించిన పథకంలోని ప్రధాన సారాంశం ఇదే అని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. శుక్రవారం ఈ రెండు వర్గాలు విలీనానికి చేరువైనాయని, మెరీనా బీచ్‌లోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే చివరిక్షణంలో తలెత్తిన సమస్యల కారణంగా విలీనం ఆలస్యమైంది. అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు విలీనమయితే ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిన రెండాకుల గుర్తు కూడా పార్టీకి తిరిగి లభిస్తుంది.
రెండువర్గాల విలీనానికి తానే అడ్డంకిగా ఉన్నట్లు వచ్చిన వార్తలను పన్నీర్‌సెల్వం వర్గంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన కెపి మునుస్వామి తోసిపుచ్చారు. పన్నీర్‌సెల్వం చేపట్టిన ధర్మయుద్ధంలో ప్రధాన డిమాండ్ జయలలిత అనుంగు నెచ్చెలి అయిన శశికళను, ఆమె బంధువర్గాన్ని పార్టీనుంచి బహిష్కరించాలనేది ప్రధాన డిమాండ్ అని, ఈ విషయంలో తాను గట్టిపట్టుగా ఉన్నట్లు చెప్పారు. అయితే పన్నీర్‌సెల్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, మిగతా అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.