జాతీయ వార్తలు

బిసిల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: వెనుకబడిన తరగతుల వారి సమస్యలు పరిష్కరించాలని బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కర్నాటక సిఎం సిద్దరామయ్యను గురువారం ఇక్కడ కలిశారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా బిసిల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. బిసి అయిన ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గాల డిమాండ్‌లు పరిష్కరిస్తారని ఆశించామన్నారు. దేశ వ్యాప్తంగా బిసిలకు జరుగుతున్న అన్యాయాలపై మంత్రులకు వివరించినట్టు కృష్ణయ్య తెలిపారు. ప్రధాని మోదీ బిసిల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రంలోని కొందరు ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరారు..