జాతీయ వార్తలు

కలిసిన రెండాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనె్న, ఆగస్టు 21: తమళనాట అనేక హైడ్రామాల నడుమ అధికార పార్టీలోని రెండు గ్రూపులు విలీనమయ్యాయి. గత డిసెంబర్‌లో అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీలో అనేక పరిణామాలు సంభవించాయి. ముఖ్యమంత్రి పదవికోసం మొదలైన కుమ్ములాటలు తిరుగుబాటుకు దారితీశాయి. అదికాస్తా అన్నాడిఎంకెలో చీలికకు దారితీసింది. అనేక అనూహ్యమైన పరిణామాలు పార్టీలో చోటుచేసుకున్నాయి. జయ మరణం తరువాత శశికళ జైలుకెళ్తూ తన రాజకీయ వారసుడిగా టిటివి దినకరన్‌ను నియమించింది. జయ మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే నగర్ నియోజకవర్గంలో గెలవడానికి అధికార పార్టీ ఎన్నో ఎత్తులు వేసి ఘోర వైఫల్యం చెందింది. బలనిరూపణలో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం విఫలం చెందడంతో శశికళ వర్గానికి చెందిన పళనిసామి సిఎం పీఠం ఎక్కారు. ఈలోగా దినకర్, పళనిసామి మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు తలెత్తాయి. సిఎం తీరుపై శశికళ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. శశికళ, దినకర్‌లను కట్టడి చేయాల్సిన పన్నీర్‌సెల్వం, పళనిసామి నిర్ణయించుకున్నారు. అనేక తర్జనభర్జనల తరువాత అన్నాడిఎంకెలోని రెండు వర్గాలూ కలిసిపోయాయి. తమిళనాడులో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుందీ క్లుప్తంగా...
2016 డిసెంబర్ 5: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మృతి
జయ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం సిఎంగా ప్రమాణస్వీకారం
డిసెంబర్ 9: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక
2017 ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా
అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ నేతగా శశికళ ఎంపికను నిరసించిన ఓపిఎస్
పన్నీర్ సెల్వం రాజీనామాకు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు ఆమోదం
ఫిబ్రవరి 7: జయ సమాధివద్ద పన్నీర్ ప్రతిజ్ఞ. శశికళపై తిరుగుబాటు
ఫిబ్రవరి 10: నూట ఇరవై మందికి పైగా అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించిన శశికళ వర్గం
ఫిబ్రవరి 14: అక్రమ ఆస్తుల కేసులో శశికళను దోషిగా తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
కె పళనిసామి అన్నాడిఎంకె శాసభసభా పక్షనేతగా ఎన్నిక
పన్నీర్‌సెల్వం, మరో 19 మంది పార్టీ సీనియర్లపై అన్నాడిఎంకె వేటు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరణ
ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రిగా పళనిసామి ప్రమాణ స్వీకారం
ఫిబ్రవరి 17: శశికళ, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరిస్తున్నట్టు పన్నీర్ సెల్వం గ్రూపు ప్రకటన
ఫిబ్రవరి 18: అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన పళనిసామి
మార్చి 8: జయ మృతిపై విచారణ కోరుతూ పన్నీర్ సెల్వం వర్గం రాష్ట్ర బంద్‌కు పిలుపు
మార్చి 15: ఆర్కేనగర్ అన్నాడిఎంకె అభ్యర్థిగా టిటివి దినకరన్ ఎంపిక
మార్చి 22: అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎన్నికల సంఘం
మార్చి 23: పన్నీర్‌సెల్వం గ్రూపునకు ఎలక్ట్రిక్‌పోల్, పళనిసామి వర్గానికి టోపీ గుర్తు కేటాయింపు
ఏప్రిల్ 9: విచ్చలవిడిగా డబ్బు వెదలజల్లుతున్నారన్న కారణం ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు
ఏప్రిల్ 17: రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారులు లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలపై దినకరన్‌పై ఢిల్లీ క్రైమ్ పోలీసుల కేసు
ఏప్రిల్ 18: ఓపిఆర్ వర్గంతో చర్చలకు సిద్ధమని పళని వర్గం ప్రకటన. శశి బంధువులపై కేబెనెట్ నిప్పులు
ఏప్రిల్ 19: దినకరన్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లు
ఏప్రిల్ 25: దినకరన్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఏప్రిల్ 26: అన్నాడిఎంకె ప్రధాన కార్యాలయంలో శశికళ బ్యానర్లు తొలగింపు
మే 2: ఎన్నికల అధికారులను లంచం ఇవ్వజూపారన్న కేసులో దినకరన్, ఆయన బంధువులపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన ఈడి
మే 6: జయ మృతిపై సిబిఐ విచారణకు పళనిసామి వర్గం సానుకూలత. విలీనం ప్రయత్నాలు జోరు
మే 19: కేంద్ర ఎన్నికల సంఘంతో ఓపిఆర్ వర్గం భేటీ. శశికళ వర్గాన్ని కట్టడి చేయాలని ఫిర్యాదు
జూన్ 5: బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న శశికళతో దినకరన్ భేటీ
జూన్ 11: అమ్మ వర్గంతో చర్చలకు పన్నీర్ గ్రీన్ సిగ్నల్.
ఆగస్టు 10: దినకరన్ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఎంపిక చేయడం పార్టీ నిబంధనావళికి విరుద్ధమని ప్రకటించిన పళనిసామి వర్గం
ఆగస్టు 17: జయ మృతిపై విచారణకు ముఖ్యమంత్రి పళనిసామి అంగీకారం. చెనె్నలోని జయ నివాసం పొయెస్ గార్డెన్ సంస్మరణ కేంద్రంగా ప్రకటన.
ఆగస్టు 18: శశికళ జన్మదినోత్సవం సందర్భంగా జైలుకెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన దినకరన్
ఆగస్టు 19: కలిసి పనిచేయాలని పార్టీలోని రెండు వర్గాలు నిర్ణయం. దీనిపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన పన్నీర్, పళని
ఆగస్టు 21: అన్నాడిఎంకెలోని రెండు గ్రూపులు విలీనం
* * *

చిత్రం..అన్నాడిఎంకెలోని రెండు వర్గాల విలీనం అనంతరం ఉపముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితరులతో పన్నీర్ సెల్వం.