జాతీయ వార్తలు

విదూషకుడి టోపీ పెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నాడిఎంకె గ్రూపుల విలీనంపై ప్రముఖ నటుడు కమల్‌హసన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ విలీనం ద్వారా అన్నాడిఎంకె పార్టీ తమిళ ప్రజల నెత్తిపై విదూషకుడి టోపీని పెడుతోందని, ఈ టోపీని తొలగించుకోవాలని ఆయన అన్నారు. ఆరు నెలల విభేదాల తరువాత అన్నాడిఎంకె వర్గాలు సోమవారం కలిసిన సంగతి తెలిసిందే. ఇటీవల డిఎంకె పార్టీ సమావేశంలో ప్రముఖంగా కనిపించిన కమల్ హసన్ తమిళ రాజకీయాలపై ఇటీవల క్రియాశీలంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
- సినీ నటుడు కమల్‌హాసన్
అవకాశవాద నిర్ణయం
చీలిక వర్గాలు విలీనం కావడం అవకాశవాద నిర్ణయం. బిజెపి అభీష్ఠం మేరకే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. బిజెపి లాంటి మతతత్వ శక్తులతో చేతులు కలపడం అన్నా డిఎంకెకి ప్రమాదకరం. ఈ అవకాశవాదాన్ని తమిళనాడు ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు.
- సిపిఎం నేత ప్రకాశ్ కారత్
ఏం ప్రయోజనం ఉండదు
విలీనంతో ఆ పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. అంతేతప్ప తమిళనాడు ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. పజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ విలీనం ఏమాత్రం తోడ్పడదు. అయినా ప్రజలు ఓట్లు వేసింది ఈ నాయకులకు కాదు. కనుక అన్నా డిఎంకె ప్రభుత్వం మనుగడ సాగించడం అనుమానాస్పదమే.
- డిఎంకె ఎంపీ కనిమోళి