జాతీయ వార్తలు

మాలెగావ్ పేలుళ్ల నిందితుడు లెఫ్టినెంట్ పురోహిత్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: తొమ్మిదేళ్లనాటి మాలెగావ్ వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌కు సోమవారం సుప్రీం కోర్టు బెయల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు బెయిల్‌కోసం పురోహిత్ చేసుకున్న అభ్యర్థనను ముంబయ హైకోర్టు తిరస్కరించింది. పురోహిత్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్‌కె అగర్వాల్, జస్టిస్ ఎఎం సప్రేతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును పక్కనబెట్టి బెయిల్ మంజూరు చేసింది. పురోహిత్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2008లో ముస్లిం చేనేతకారుల ఎక్కువగా ఉండే మాలెగావ్‌లో జరిగిన పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఉత్తర మహారాష్టల్రోని నాసిక్ జిల్లాలో 2008 సెప్టెంబర్ 29న ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర సంచలనం సృష్టించిన పేలుళ్ల ఘటనకు సంబంధించి మితవాద సంస్థ అభినవ్ భారత్ ట్రస్టు కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపించారు. ట్రస్ట్‌కు చెందిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్‌లను అరెస్టు చేశారు. సాధ్వీ ఠాకూర్‌కు గత ఏడాది బెయిల్ మంజూరైంది. పురోహిత్‌కు బెయిల్ రాలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం కింద చేసిన అభియోగాలు హైకోర్టు కొట్టివేసినట్టు పురోహిత్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకు విన్నవించారు. నేరం రుజువైనా ఈ పాటికి శిక్ష ముగిసేదని, తన క్లయింట్ ఇప్పటికే తొమ్మిదేళ్లు జైలులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.