జాతీయ వార్తలు

సాధికారతకు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: త్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఎన్‌డిఏ, ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు ప్రశంసించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మికమని నరేంద్ర మోదీ చెప్పారు. త్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు వలన ముస్లిం మహిళలకు సమానత్వం లభించటంతోపాటు వారి సాధికారితకు ఎంతో తోడ్పడుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. తీర్పు ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతుంది, కొత్త అధ్యాయానికి ఇదొక ప్రారంభమని అమిత్ షా అభివర్ణించారు. త్రిపుల్ తలాక్ పలు ముస్లిం దేశాల్లో సైతం అమలులో లేదు, అలాంటిది మన దేశంలో ఇంతకాలం అమలు కావటం అన్యాయమని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి విజయం, మరొకరి ఓటమి కాదు, ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీం తీర్పు మేరకు త్రిపుల్ తలాక్ రద్దును ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది, ఈ విషయంలో ఎవరి వత్తిడులకు లొంగే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ కూడా సుప్రీం తీర్పును ప్రశంసించారు. సుప్రీం కోర్టు తీర్పు వలన ముస్లిం మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. త్రిపుల్ తలాక్ రద్దు వలన ముస్లిం మహిళలకు ఊహించనంత మేలు జరుగుతుంది, వారి జీవితాల్లో వెలుగు వస్తుంది, భద్రత కలుగుతుందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.