జాతీయ వార్తలు

భవిష్యత్ కార్యాచరణపై 10న ముస్లిం లా బోర్డు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 22: ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) తన భవిష్యత్తు కార్యాచరణను భోపాల్‌లో సెప్టెంబర్ 10న రూపొందించుకోనుంది. ఇంతకు ముందే బోర్డు కార్యవర్గ సమావేశం నిర్ణయించినప్పటికీ అజెండాను మాత్రం ఈ రోజు విడుదల చేసినట్లు బోర్డు కార్యవర్గ సభ్యుడు జఫర్యాబ్ జిలానీ చెప్పారు. ‘సెప్టెంబర్ 10న భోపాల్‌లో జరిగే కార్యవర్గ సమావేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లోతుగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకొంటుంది’ అని ఆయన చెప్పారు. సమావేశంలో మిగతా అంశాలను కూడా చర్చించనున్నప్పటికీ ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రధాన అంశంగా ఉంటుందని సీనియర్ న్యాయవాది కూడా అయిన జిలానీ చెప్పారు. బాబ్రీ మసీదుపై సుప్రీం కోర్టు విచారణ కూడా భోపాల్ సమావేశం అజెండాలో ఉందని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండా ఆ తీర్పుపై వ్యాఖ్యానించడం సరికాదని ఒక ప్రశ్నకు సమాధానంగా జిలానీ చెప్పారు.