జాతీయ వార్తలు

అది విలీనం కాదు.. వాణిజ్య ఒప్పందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 22: అన్నాడిఎంకెలో రెండు గ్రూపులు విలీనం కావడంపై పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ స్పందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం ఇద్దరూ అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను మోసం చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. పళని, పన్నీరులపై తీవ్ర విమర్శలు చేస్తూ దినకరన్ వరుస ట్వీట్లు చేశారు. వారిద్దరూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని టిటివి ధ్వజమెత్తారు.
పళని, పన్నీరు ఒప్పందం ఎలా చెల్లుబాటవుతుందని ఆయన ప్రశ్నించారు. ‘అది విలీనం కాదు. పదవీ వ్యామోహంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం. వ్యక్తిగత స్వలాభం కోసం కొత్త డ్రామాను తెరమీదకు తెచ్చారు’ అని దినకరన్ నిప్పులు చెరిగారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని రాజకీయంగా తన సత్తా ఏమిటో నిరూపిస్తానని సిఎం, డిప్యూటీ సిఎంలను ఆయన హెచ్చరించారు. అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులకోసం పోరాడి సాధించుకుంటామని శశికళ మేనల్లుడు దినకరన్ ప్రకటించాడు. ప్రస్తుతం తాను గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నానన్న దినకరన్ బుధవారం మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
‘ఏం జరుగుతుందో ఏమిటో భగవంతుడికి తెలుసు’ అని ఆయన చెప్పారు. ఎంజిఆర్ మరణం తరువాత పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని చక్కదిద్దిన జయలలితను కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారని దినకరన్ స్పష్టం చేశారు. ఆనాడు కేడర్ అంతా జయ వెనకాలే ఉన్నారని, ఇప్పటి పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఉప ప్రధాన కార్యదర్శి చెప్పారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల అనైతిక ఒప్పందాన్ని అన్నాడిఎంకె కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రెండాకుల గుర్తుపై రాద్ధాంతం చేసి ఇసి పరిధిలోకి వెళ్లడానికి కారకుడైన పన్నీర్ సెల్వంను కార్యకర్తలు ఎలా క్షమిస్తారని ఆయన నిలదీశారు.