జాతీయ వార్తలు

మాల్యాపై ఐపీ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను దేశంనుంచి పంపించి వేయడానికి బ్రిటన్ నిరాకరించిన తర్వాత మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు సహకరించేలా చేయడం కోసం ఆయనపై ఇంటర్‌పోల్ అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. అంతర్జాతీయ పోలీసు సంస్థ అయిన ఇంటర్‌పోల్‌నుంచి రెడ్‌కార్నర్ నోటీసు సంపాదించాలని ఇడి సిబిఐకి ఒక లేఖ రాసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత దేశంలో ఇంటర్‌పోల్ వారెంట్ల అమలుకు సిబిఐ నోడల్ కార్యాలయంగా వ్యవహరిస్తోంది. ఏదయినా ఒక కేసులో నిందితులుగా ఉండే వ్యక్తులు వేరే దేశాల్లో ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి, అరెస్టు చేసి ఆ దేశానికి అప్పగించడం కోసం రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేస్తారు. ఒక సారి ఈ నోటీసు జారీ అయితే ఇంటర్‌పోల్ సంబంధిత వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అరెస్టు చేయాలని కోరడమే కాక తమవైపునుంచి తదుపరి చర్యల కోసం వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవలసిందిగా సదరు దేశానికి తెలియజేస్తుంది. 900 కోట్ల రూపాయలకు పైబడిన ఐడిబిఐ రుణం ఎగవేత కేసు దర్యాప్తులో మాల్యా వ్యక్తిగతంగా పాలు పంచుకోవడం కోసం ఆయనను అరెస్టు చేయాలని ఇడి కోరుతోంది. దీనికి సంబంధించి ఇడి ఈ ఏడాది ప్రారంభంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాపై కేసు నమోదు చేసింది. బ్రిటన్‌లో ఉన్న మాల్యాను రప్పించడానికి ముంబయిలోని ఒక కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయించడంతో సహా చట్టపరంగా అన్ని మార్గాలను ఇడి ప్రయత్నించింది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా అది మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయించి దరిమిలా ఆయనను భారత్ రప్పించాలని చూసింది. అయితే బ్రిటన్ మాల్యాను తమ దేశంనుంచి పంపించేది లేదని స్పష్టం చేయడమే కాక, దానికి బదులుగా భారత్‌నే మాల్యాను తమకు అప్పగించాలని అధికారికంగా కోరాలని సూచించింది. ఈ కేసులో మన దేశంలో మాల్యాకున్న సుమారు 9 వేల కోట్ల రూపాయల ఆస్తులు, వాటాలను జప్తు చేయించాలని కూడా ఇడి ఇప్పుడు అనుకుంటోంది.