జాతీయ వార్తలు

రాష్ట్రం ఏర్పడినా ఫలితం శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రాష్ట్ర ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదనీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగటం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, టిజెఏసి అధ్యక్షుడు కోదండరామ్, సంఘ సంస్కర్త స్వామి అగ్నివేష్ తదితర ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘మూడేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలన’పై సెమినార్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒకటి రెండు సంవత్సరాల్లో అన్ని సమస్యలు పరిష్కారమతాయని ఆశించామని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్ని కూడా నెరవేర్చలేకపోయిందని సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని వేగం చూస్తుంటే ఇచ్చిన హామీలు పూర్తయ్యేందుకు మూడు వందల సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. కెసిఆర్ హయాంలో రాష్ట్రంలో పోలీసు రాజ్యం, నిజాం నిరంకుశ పాలన చోటు చేసుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రశేఖరరావుకు సంస్కారం నేర్పించాలి, బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి ఏదైనా అవార్డు ఉంటే దానికి కెసిఆర్ అర్హుడని సుధాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. చంద్రశేఖరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ, కుటుంబ పాలనను ఎదుర్కొనేందుకు ఆందోళన చేపట్టవలసిన సమయం వచ్చిందన్నారు. స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు త్వరగా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని టిజెఏసి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమం తరువాత జరిగిన అతి పెద్ద ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడది చంద్రశేఖరరావు కుటుంబానికి పరిమితమైపోతోందన్నారు. చంద్రశేఖరరావు కుటుంబం, కొంతమంది కాంట్రాక్టర్లు తెలంగాణలో పెత్తనం చెలాయిస్తున్నారని కోదండరామ్ దుయ్యబట్టారు. తెలంగాణాలో ప్రజాస్వామ్య సాధనకు జాతీయ నాయకులు, సామాజిక వేత్తలు మద్దతు పలకటం సంతోషకరమని ఆయన అన్నారు.

చిత్రం..‘మూడేళ్ల టిఆర్‌ఎస్ పాలన’పై మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సెమినార్‌లో ప్రసంగిస్తున్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్. చిత్రంలో సంఘ సంస్కర్త స్వామి అగ్నివేష్, టిజెఏసి నేత కోదండరామ్ ఉన్నారు.