జాతీయ వార్తలు

పట్టం కడితే శరణార్థులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 25: అస్సాంలో తాము అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దులను శాశ్వతంగా మూసేసి శరణార్థుల రాకను అరికడతామని బిజెపి తన ఎన్నికల పత్రంలో స్పష్టం చేసింది. అలాగే ఈ అక్రమ వలసదారులకు ఉపాధి కల్పిస్తున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టారు. గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో తిష్టవేసిన కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపేందుకు తాజా ఎన్నికలు ఓ చారిత్రక అవకాశమని అన్నారు. శుక్రవారం పార్టీ దృక్పథ ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2016 నుంచి 2025 వరకు అస్సాంను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై తాము ఈ ప్రణాళికను రూపొందించామని, దీని అమలు అనేక రకాలుగా రాష్ట్ర సమగ్ర వికాసానికి దోహదం చేస్తుందని తెలిపారు. చొరబాట్లను పెంచడం సహా అనేక ప్రతికూల చర్యలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భౌగోళిక స్వరూపానే్న మార్చివేసిందని, దాన్ని దాదాపుగా ధ్వంసం చేసిందని జైట్లీ అన్నారు. ఇప్పటివరకు చొరబాట్ల కారణంగా రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, దిద్దుబాటు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని చెప్పారు. రాష్ట్ర ప్రజలు చాలా బలంగా మార్పును కోరుకుంటున్నారని, ఈ విషయంలో వారి ఆకాంక్ష చాలా బలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ చేసే నినాదాలతో విసుగెత్తిపోయిన ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని, యువత కూడా ఉపాధి అవకాశాల కోసం అర్రులు చాస్తోందని తెలిపారు. రాష్ట్రంలో యువతకు అన్నివిధాలుగా అవకాశాలు అందించాలనేదే బిజెపి లక్ష్యమని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని అన్నారు. అస్సాం గణపరిషత్‌తో బిజెపి కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందం విజయవంతం కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అస్సాం గణపరిషత్ రాజకీయ విస్తృతి, బిజెపి అంతర్గత శక్తి ఈ కూటమి విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. సోనేవాల్ నాయకత్వంలో తాము ఎన్నికల్లో పోటీచేస్తున్నామని, ఆయన నాయకత్వం కచ్చితంగా అనుకున్న ఫలితాలు ఇవ్వగలదని తెలిపారు. కాంగ్రెస్‌తో పోలిస్తే ఉద్దండులైన నాయకులు బిజెపికి ఉన్నారని ఈ అంశాలన్నీ కూడా బిజెపి అఖండ విజయానికి దోహదం చేసేవేనని వెల్లడించారు.
గౌహతిలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శరణార్థుల సమస్యపైనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించారు. అస్సాం సరిహద్దును మూసివేయకపోవడం వల్ల బంగ్లానుంచి లక్షలాదిమంది తరలి వచ్చారని, ఆ విధంగా రాష్ట్ర యువత ఉపాధిని కైంకర్యం చేశారని అమిత్ షా అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం బిజెపి అధికారంలోకి రావడం వల్లే సాధ్యమవుతుందని అన్నారు.
126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 4, 11 తేదీ ల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.