జాతీయ వార్తలు

కంటైనర్లలో డబ్బు కట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, మే 14: ఎన్నికల వేళ తమిళనాడులో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనం సృష్టించింది. శనివారం తిరుపూర్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు మూడు కంటైనర్లలో తరలిస్తున్న రూ.570 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదును కోయంబత్తూరులోని ఎస్‌బిఐ బ్రాంచ్‌నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం బ్రాంచీలకు తరలిస్తున్నట్లు కంటైనర్ వాహనాల వెంట ఉన్న సిబ్బంది చెప్పారని, అయితే వారి వద్ద అందుకు సరయిన డాక్యుమెంట్లు లేవని అధికారులు చెప్పారు. శనివారం తెల్లవారుజామున పారామిలిటరీ జవాన్లతో కలిసి పెరుమనల్లూర్-కున్నత్తూర్ బైపాస్‌పై రొటీన్‌గా వాహనాలు తనిఖీ చేస్తున్న ఎన్నికల విభాగం ఫ్లైయింగ్ స్క్వాడ్ ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కంటైనర్ల వెనుక ఎస్కార్ట్‌గా మూడు కార్లు వస్తున్నాయి. ఆపినా ఆగకుండా వెళ్లడంతో అధికారులు వాటిని వెంటాడి చెంగపల్లి వద్ద ఆపి చెక్ చేయగా, కంటైనర్లలోపల బాక్స్‌లలో నగదు కట్టలున్నట్లు కనుగొన్నామని పోలీసులు తెలిపారు. అయితే తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులమని కార్లలో ఉన్న వారు చెప్పారు కానీ వారెవరూ యూనిఫామ్‌లో లేకపోవడం అనుమానాలకు కారణమైంది.
వీడిన చిక్కుముడి
విశాఖపట్నం: తమిళనాడులో మూడు కంటైనర్లలో పట్టుబడ్డ భారీ మొత్తం నగదు విశాఖలోని ఎస్‌బిఐకి చెందినదని తేలింది. విశాఖ ఎస్‌బిఐ అధికారులు శనివారం నగర పోలీసు ఇన్‌ఛార్జి కమిషనర్ జి సూర్యప్రకాశరావును కలిసి నగదుకు సంబంధించిన ఆధారాలు అందించారు. వీటిని పోలీసు కమిషనర్ తమిళనాడు అధికారులకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇదే విషయమై సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నగదుకు సంబంధించి ఎస్‌బిఐ నుంచి ఫిర్యాదు అందిందన్నారు. బ్యాంకు సిబ్బందితో కలిసి పోలీసులు చెన్నై వెళ్తున్నట్టు వివరించారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించి అక్కడి నుంచి కంటైనర్లను విశాఖకు తరలిస్తామన్నారు.

తమిళనాడులో పట్టుబడ్డ నగదు కంటైనర్లను కాపలా కాస్తున్న భద్రతా సిబ్బంది