జాతీయ వార్తలు

బెంగాల్ పీఠంపై మళ్లీ మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 19: ప్రభుత్వ వ్యతిరేత, ప్రతిపక్షాలయిన వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడంలాంటి ప్రతికూల పవనాలకు ఎదురొడ్డి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీని సాధించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 294 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 211 స్థానాలను దక్కించుకుంది. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలకన్నా కూడా ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. అయితే ఎన్నికల పండితులు ఊహించినట్లుగా లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. లెఫ్ట్‌ఫ్రంట్‌కు కేవలం 32 స్థానాలు దక్కాయి. అయితే లెఫ్ట్‌ఫ్రంట్‌కన్నా కూడా కాంగ్రెసే మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఆ పార్టీ మొత్తం 44 స్థానాలను దక్కించుకుంది. కాగా, పాతిక సంవత్సరాలకు పైగా రాష్ట్రాన్ని ఎదురు లేకుండా పాలించిన సిపిఎం పాతిక స్థానాలకే పరిమితమైంది. బిజెపి మూడు చోట్ల విజయం సాధించగా, వాటిలో ఆ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సాదించిన విజయం కూడా ఉంది. డార్జిలింగ్ హిల్స్ ప్రాంతంలో గూర్ఖా జనముక్తి మోర్చా మూడు చోట్ల గెలుపొందింది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంనుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మమతపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి దీపదాస్ మున్షీ ఓడిపోయారు. గెలుపొందిన ఇతర టిఎంసి మంత్రుల్లో అమిత్ మిత్రా, పార్థా చటర్జీ, సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, మలయ్ ఘటక్, నగర మేయర్ సవన్ చటర్జీ ఉన్నారు. కాగా, ఓడిపోయిన మంత్రుల్లో మనీష్ గుప్తా, చంద్రిమా భట్టాచార్య, క్రిష్ణేందు నారాయణ్ చౌదరి, సావిత్రీ మిత్రా ఉన్నారు.కాగా, శారదా చిట్‌ఫండ్ కుంభకోణంతో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న తృణమూల్ కాణగ్రెస్‌కు చెందిన మరో ప్రముఖుడు మదన్‌మిత్రా సైతం ఓటమి పాలయ్యారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా నారాయణ్ ఘర్ నియోజకవర్గంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా ఓటమి పాలవడం విశేషం. కోల్‌కతా నగరంలో ఉన్న మొత్తం 11 స్థానాల్లోను టిఎంసి విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించింది. హౌరా నార్త్ నియోజకవర్గంనుంచి మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా టిఎంసి టికెట్‌పై గెలుపొందారు. ఆయన బెంగాల్ సినీ నటి రూపా గంగూలిపై గెలుపొందారు. టిఎంసి టికెట్‌పై పోటీ చేసిన భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా సిలిగురి నియోజకవర్గంలో ఓడిపోయారు.
కాగా, తమ నాయకుడ్ని ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికయిన టిఎంసి ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమవుతారని మమతా బెనర్జీ చెప్పారు. ఈ నెల 27న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని కూడా ఆమె చెప్పారు.
విజేతల్లో ప్రముఖులు
దిలీప్ ఘోష్
(బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు)
అమిత్ మిత్రా
(రాష్ట్ర మంత్రి)
సావన్ చటర్జీ
(కోల్‌కతా మేయర్)
లక్ష్మీరతన్ మిశ్రా
(మాజీ క్రికెటర్)
పరాజితుల్లో ప్రముఖులు
సూర్యకాంత మిశ్రా
(సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)
రూపా గంగూలీ
(బెంగాలీ సినీ నటి)
దీప దాస్ మున్షీ
(మాజీ కేంద్ర మంత్రి)
బైచుంగ్ భుటియా
(్ఫట్‌బాల్ క్రీడాకారుడు)
మదన్‌మిత్రా
(శారదా చిట్‌ఫండ్ నిందితుడు)