జాతీయ వార్తలు

శశికళ గెంటివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 12: తమిళనాడు అధికార అన్నా డిఎంకెలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న విభేదాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. మంగళవారం ఇక్కడ సమావేశమైన అధికార అన్నాడిఎంకె వర్గం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవినుంచి శశికళను బర్తరఫ్ చేసింది. దివంగత జయలలితనే ‘శాశ్వత ప్రధాన కార్యదర్శి’గా నియమిస్తూ ఓ తీర్మానం చేసింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం చెందిన శశికళ విధేయుడు దినకరన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి తీరుతానంటూ ప్రతిజ్ఞ చేశాడు.
జయలలిత మరణానంతరం అన్నాడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించిన పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గమే ఇప్పుడు ఆమెను ఏకగ్రీవ తీర్మానంతో బర్తరఫ్ చేయడం గమనార్హం. మంగళవారం నాడిక్కడ జరిగిన పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పిందే వేదం అన్నట్లుగా సర్వసభ్య మండలి స్పష్టం చేసింది. అలాగే వీరిద్దరికీ పూర్తిస్థాయిలో కార్యనిర్వాహక అధికారాలను అప్పగించింది.
శశికళకు పూర్తిగా ద్వారాలు మూసివేస్తూ పార్టీలో ఆమె చేసిన నియామకాలన్నింటినీ ఈ సమావేశం రద్దుచేసింది. జయ మరణానంతరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, ఆ సమయంలో ఆపద్ధర్మంగా పార్టీ వ్యవహారాలు నిర్వహించేందుకే శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని ఈ సమావేశం స్పష్టం చేసింది. 2016 డిసెంబర్ 30నుంచి 2017 ఫిబ్రవరి 16 వరకు శశికళ తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లవని ఈ సమావేశం తేల్చిచెప్పింది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.