జాతీయ వార్తలు

తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పుడున్న 4 శాతం కరవు భత్యం (డిఏ/డిఆర్)ను 5 శాతానికి పెంచాలని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బేసిక్ వేతనం/పింఛనుపై ఇప్పుడున్న 4 శాతం కరవుభత్యానికి అదనంగా మరో శాతం విడుదల చేయాలని నిర్ణయించారని, కొత్త డిఏ జూలై 1నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుంది. కరవుభత్యం పెంపువల్ల ఖజానాపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల కాలానికి డిఏ రూపంలో 3,068.26 కోట్లు, డిఆర్ రూపంలో 2.045.50 కోట్ల భారం పడుతుందని ఆ ప్రకటన తెలిపింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్‌ను 20 లక్షల రూపాయలకు పెంచడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడానికి ముందు ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితి 10 లక్షల రూపాయలుగానే ఉంది. అయితే ఈ సిఫార్సులను అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 20 లక్షలుగా ఉండగా, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్ మాత్రం 10 లక్షలుగానే ఉంది. వారికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ చెల్లించడానికి వీలుగా 1972 నాటి గ్రాట్యుటీ చట్టానికి సవరణ చేయడానికి ఈ బిల్లును తీసుకు వస్తున్నారు.