జాతీయ వార్తలు

పార్లమెంటులో సర్కార్‌ది ఘర్షణ వైఖరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఇప్పటికీ ఘర్షణ వైఖరినే అనుసరిస్తోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. అంతేకాదు, ప్రభు త్వం ప్రతిపక్షాలకు చేరువయ్యే విషయంలో ఇంక చాలా దూరంలోనే ఉందని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఫాలో అవుతుండడం ఓ మంచి పరిణామమన్న వాదనలను కూడా ఆ పార్టీ కొట్టి పారేసింది. ‘ప్రభుత్వం ప్రతిపక్షానికి చేరువ అవుతున్న ఓ చిన్నపాటి సంకేతం కూడా కనిపించడం లేదు. పార్లమెంటులో దాని ధోరణి చర్చలతో పరిష్కరించుకునే తీరులో కాక ఘర్షణను కోరుకునేదిగానే ఉంటోంది’ అని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో కేజ్రివాలాను ఫాలో అవుతుండడాన్ని ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సంబంధాల్లో సానుకూల పరిణామంగా బిజెపి అభివర్ణించడం గురించి విలేఖరులు సచిన్ పైలట్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. ప్రభుత్వం గనుక ప్రతిపక్షాలను ఒప్పించడానికి ప్రయత్నించి ఉంటే అది జిఎస్‌టి లాంటి కీలక బిల్లులు త్వరగా ఆమోదం పొందడానికి దారి తీసి ఉండేదని ఆయన అన్నారు. ‘ఒక వ్యక్తి ట్విట్టర్‌ను ఫాలో అయినంతమాత్రాన ఏమీ జరగదు’ అని ఆయన అన్నారు. మోదీ, కేజ్రివాల్‌ను చాలాకాలంగా అనేక విషయాల్లో బద్ధ శత్రువుల్లాగా వ్యవహరిస్తూ ఉన్న విషయం తెలిసిందే.
జమ్మూ, కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిడిపి, బిజెపిలు మరోసారి చేతులు కలపడం గురించి అడగ్గా, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ రెండు పార్టీలు అన్ని రోజులు ఎందుకు తీసుకున్నాయో అర్థం కావడం లేదని పైలట్ అన్నారు. అన్ని విషయాలు తెరవెనుకే నిర్ణయించబడుతున్నందున ఏవయినా షరతులు పెట్టారో, ఆమోదించారో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. అంతేకాదు, ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి తర్వాత కొత్తగా వచ్చిన విభేదాలేమిటని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమయినా కాశ్మీర్ చాలా ముఖ్యమైన రాష్టమ్రని ఆయన అంటూ పిడిపి, బిజెపిలు రెండూ రాజకీయాల్లో పరస్పర భిన్నమైనవనే విషయం అందరికీ తెలిసిందేనని పైలట్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిస్థితి గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతు నొక్కడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.