జాతీయ వార్తలు

మళ్లీ తేవాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: మోదీ ప్రభుత్వం పాత వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసి పది నెలలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు 70 శాతం మంది తిరిగి వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెట్టాలని కోరుకొంటున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. దేశంలో చెలామణిలో ఉన్న 16.74 లక్షల కోట్ల విలువైన బ్యాంకు నోట్లలో 86 శాతానికి పైగా వెయ్యి, 500 రూపాయల నోట్లే ఉండగా, గత నవంబర్‌లో మోదీ ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దయిన నోట్లలో దాదాపు 99 శాతం వ్యవస్థలోంచి వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ సైతం ప్రకటించింది. అయితే వెయ్యి రూపాయల నోటు తిరిగి రావాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 69 శాతం మంది అవుననే సమాధానమిచ్చారని నోట్ల రద్దుపై తాజాగా సర్వే నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన ‘వే 2’
ఆన్‌లైన్ న్యూస్‌పోర్టల్ తెలిపింది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 2 వేలు, 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రద్దయిన పాత నోట్లను ఈ కొత్త నోట్లతో మార్చుకునేందుకు జనం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అలాగే తక్కువ విలువ కలిగిన నోట్ల కొరతతో కూడా జనం ఇబ్బందులు పడడం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత చిల్లర దొరకడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 62 శాతం మంది అభిప్రాయ పడగా, 38 మంది మాత్రం ఎలాంటి సమస్యా ఎదురు కాలేదని చెప్పారు. చిల్లర సమస్య పరిష్కారంకోసం రిజర్వ్ బ్యాంక్ గత ఆగస్టులో కొత్తగా 200 రూపాయల నోటును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనివల్ల సమస్య చాలావరకు పరిష్కారముతుందని దాదాపు 67 శాతం మంది అభిప్రాయపడగా, 17 శాతం మంది మాత్రం ఈ కొత్త నోటుతో ఎలాంటి తేడా రాదని అన్నారని కూడా సర్వే తెలిపింది. చిల్లర పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పిన 62 శాతం మందిలో 44 శాతం మంది మాత్రం 200 నోటును ప్రవేశపెట్టడం వల్ల సమస్య తీరుతుందని భావించగా, 10 శాతం మంది మాత్రం కేవలం ఒక్క నోటు వల్ల పెద్ద నోట్లకు, చిన్న నోట్లకు మధ్య ఉన్న భారీ అఘాతం పూడదని భావిస్తున్నారు. 8 శాతం మంది మాత్రం దీని ప్రభావం తమపై ఏమీ ఉండదని చెప్పడం గమనార్హం. బహుశా వీళ్లంతా డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిన వాళ్లో లేక కొత్త నోట్ల లభ్యతపై అనుమానాలు ఉన్న వాళ్లో కావచ్చని కూడా ఆ సర్వే స్పష్టం చేసింది.