జాతీయ వార్తలు

180 రోజులు తప్పనిసరి కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: విడాకులకు సంబంధించి హిందూ వివాహ చట్టంలో కీలక మార్పులను సుప్రీం కోర్టు సూచించింది. విడాకుల నిర్ణయం వాస్తవికంగా అమలు కావాలంటే సదరు దంపతులు హిందూ వివాహ చట్టం ప్రకారం 18నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇందులో పనె్నండు నెలలు వీరు వేరువేరుగానే జీవించినట్టు నిర్థారణ ఉండాలి. తర్వాత ఆర్నెల్ల పాటు సయోధ్యకు సంబంధించి అవకాశం ఉంటుంది. ఈ ఆర్నెల్ల నిబంధనను తప్పనిసరిగా సదరు దంపతులకు వర్తింపజేయాలా వద్దా అన్నది ఆయా కేసులను విచారిస్తున్న న్యాయమూర్తుల విచక్షణకే వదిలేస్తున్నట్టు సుప్రీం కోర్టు మంగళవారం కీలక సూచన చేసింది. అంటే ఏడాది పాటు విడిగా జీవించిన వారికి ‘మనసులు కలిసే అవకాశం’ కల్పించేందుకు వీలుగా మరో ఆర్నెల్ల గడువు ఇవ్వడం అన్నది నిర్బంధం కాదని సుప్రీం బెంచి తేల్చిచెప్పింది. నిరర్థక వివాహాలను కొనసాగించి సదరు భార్యాభర్తల ఆవేదనను మరింత పొడిగించడమన్నది అర్థరహితమని తేల్చిచెప్పింది. ఇక తాము కలిసి ఉండలేమన్న కచ్చితమైన నిర్ణయానికి వచ్చేసిన జంటలకు ఆర్నెల్ల సయోధ్య గడువును ఇవ్వాలా వద్దా అన్నది న్యాయమూర్తులకే వదిలేస్తున్నామని తెలిపింది. వివాహాలను పరిరక్షించేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన ధర్మాసనం ‘వీరు కలిసి జీవించేందుకు అవకాశమే లేనప్పుడు తుది నిర్ణయాన్నీ వారికే వదిలేయాలి’అని పేర్కొంది.