జాతీయ వార్తలు

అమిత్‌షా ఆటలు మా దగ్గర సాగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, సెప్టెంబర్ 12: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆటలు కర్నాటకలో సాగవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మంగళవారం బళ్ళారి మున్సిపల్ కళాశాల మైదానంలో నిర్వహించిన బళ్లారి అభివృద్ధి సామాజిక సాధన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటక ప్రజల ఆకాంక్ష మేరకు పలు సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. వీటిని చూసి ఓర్వలేకనే అమిత్‌షా అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బళ్లారిలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ. 2955 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన 165 హామీల్లో 155 నెరవేర్చామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం రూ.58 వేల కోట్ల ఖర్చు చేస్తుండగా కేవలం కర్నాటక రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.27,703 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. హైదరాబాద్ కర్నాటక అభివృద్ధి కోసం బిజెపి ప్రభుత్వ రూ. 300 కోట్లు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయించిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జిల్లాలో 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల కింద ఆయా లబ్ధిదారులకు అర్హత పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి తన్వీర్‌శేఠ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజినేయులు, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ, కార్మికశాఖ మంత్రి సంతోష్‌లాడ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..బళ్ళారిలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య