జాతీయ వార్తలు

సత్సంబంధాలు గిట్టవేమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, సెప్టెంబర్ 12: భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు పాకిస్తాన్ ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘించడానికి ప్రధాన కారణం ఇదేనని హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. భద్రతా చర్యల సమీక్షలో భాగంగా రాజ్‌నాథ్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. పాక్ దుందుడుకు చర్యలకు సరిహద్దులో భారత సైనిక, బిఎస్‌ఎఫ్ దళాల దీటుగానే జవాబు చెబుతున్నాయి. పాక్ దళాలు జరుపుతున్న కాల్పులను నిలువరించేలా ఒకటి రెండు రోజుల్లో గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బిఎస్‌ఎఫ్ దళాలకు ఆధునిక సామగ్రిని అందించామని తెలిపారు. ప్రతి ఏటా కనీసం 400సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఇప్పటికైనా ఆ దేశం ముగింపు పలకాలని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అక్కడే నివసిస్తున్నవారిని చూసి ప్రభుత్వం గర్వపడుతోందని, ఒకరకంగా వారు దేశానికి వ్యూహాత్మక బలమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘్భరత్‌కు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక బలం ఏమిటని ప్రశ్నించుకుంటే అది సరిహద్దుల్లో నివసిస్తున్న గ్రామాల ప్రజలే. వ్యూహాత్మక విజయం ఏదైనా లభించిన పక్షంలో అందులో ఆ గ్రామస్థుల భాగస్వామ్యాన్ని మరువలేం’ అని ప్రశంసించారు. సరిహద్దు గ్రామాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించిందని, ఆ కమిటీ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 60 బంకర్ల నిర్మాణం జరిగిందని, మరిన్ని బంకర్లను నిర్మించేందుకు ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. దేశ రక్షణలో విశేష సేవలందిస్తున్న సైనిక, బిఎస్‌ఎఫ్ దళాలను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. కాల్పులకు వెరవకుండా జీవనం సాగిస్తున్న సరిహద్దు ప్రజల సేవలను ఎప్పటికీ మరచిపోలేనిదని ప్రశంసించారు. ఇలావుండగా రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను రాజ్‌నాథ్ కలుసుకున్నారు.

చిత్రం..జమ్మూలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్