జాతీయ వార్తలు

ఆ సూట్‌ను తెరవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణంతో పోలీసులు సీలువేసిన హోటల్ సూట్‌ను తెరిచి యాజమాన్యానికి అప్పగించాలని ఢిల్లీ కోర్టు మంగళవారం ఆదేశించింది. దర్యాప్తునకు కావాల్సిన వస్తువులను దర్యాప్తు బృందం సేకరించవచ్చని పేర్కొంటూనే, సెప్టెంబర్ 26లోగా ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని కూడా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ ఆదేశించారు. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్ సూట్‌లో సునంద పుష్కర్ మృతదేహాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. హత్యా? ఆత్మహత్యా? అన్న సందిగ్ధంలో దర్యాప్తు సాగిన అనంతరం 2015 జనవరి 1న అనుమానాస్పద మృతిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సాక్ష్యాధారాల సేకరణకోసం అప్పట్లో సునంద మృతదేహం లభించిన సూట్‌కు పోలీసులు సీల్ వేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంతో విలువైన సూట్ గత రెండేళ్లుగా పోలీసుల ఆధీనంలోనే ఉండిపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 4న పిటిషన్‌ను విచారించిన కోర్టు, కేసు విషయంలో మందకొడిగా సాగుతోన్న పోలీస్ దర్యాప్తుపై గట్టిగానే ప్రశ్నించింది. అయితే, కేసు దర్యాప్తు కొలిక్కి తెచ్చేందుకు మరికొంత సమయం కావాలని దర్యాప్తు విభాగం కోర్టుకు విన్నవించింది. ఈ మధ్యనే ఫోరెన్సిక్ నిపుణులు సూట్‌ను పరిశీలించి మరికొన్ని సాక్ష్యాలు సేకరించారని, వాటి వివరాలకోసం ఎదురు చూస్తున్నట్టు దర్యాప్తు విభాగం కోర్టుకు విన్నవించింది. ఫోరెన్సిక్ ఆధారాలను నిర్థారణ చేసుకునేంతవరకూ హోటల్ సూట్‌ను యాజమాన్యానికి అప్పగించడం కష్టమేనంటూ కోర్టుకు విన్నవించింది. గత జూలై 21నే హోటల్ గదిని తెరిచి యాజమాన్యానికి అప్పగించాలంటూ కోర్టు సూచించిన విషయం తెలిసిందే. జరిగిన నేరంతో హోటల్‌కు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా దర్యాప్తు విభాగానికి సూచించింది.