జాతీయ వార్తలు

అవినీతిపరులకు తన్నులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, సెప్టెంబర్ 12: నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అలవాలంగా మారిపోయిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేసింది. ముఖ్యంగా సిఎంఓలో పర్సంటేజీల ప్రాక్టీస్ (పిసి) పెరిగిపోయిందని కాంగ్రెస్ చీఫ్ విప్ తారాప్రసాద్ భహానీపతి ధ్వజమెత్తారు. తానే ఓ రోజు సిఎంఓకి వెళ్లి అవినీతి అధికారుల భరతం పడతానని హెచ్చరించారు. ఒడిశా అసెంబ్లీ జీరో అవర్‌లో తారాప్రసాద్ మాట్లాడుతూ ‘రాష్ట్ర సచివాలయం మూడో అంతస్తులోని సిఎంఓ అవినీతి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. అక్కడినుంచే పిసి మొదలవుతోంది. ఓ శాసన సభ్యుడిగా నేను త్వరలోనే సిఎంఓకి వెళ్తా. అవినీతి అధికారులను తన్ని మరీ వస్తా’ అని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయం తాను ఆషామాషీగా చెప్పడం లేదని, సీరియస్‌గానే అంటున్నానని కాంగ్రెస్ విప్ అన్నారు. అవినీతి అధికారులను కొట్టినందుకు తనను అరెస్టు చేసుకున్నా భయపడనని ఆయన చెప్పారు. అవినీతి నిర్మూలన కార్యక్రమాన్ని తానే మొదలెడతానని విప్ ప్రకటించారు. అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న అవినీతిపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత నరసింఘా మిశ్రా విమర్శించారు. బోలాంగీర్ జిల్లాలో ఓ ఇంజనీర్‌ను బిజెడి ఎంపీ ఎయు సింగ్‌దేవ్ ఒత్తిళ్లకు లొంగి బదిలీ చేశారని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విజిలెన్స్ కేసుల్లో ఉన్న మరో ఇంజనీర్‌ను అక్కడకు బదిలీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి అధికారులను రక్షిస్తోందనడానికి ఇదో చిన్న ఉదాహరణగా మిశ్రా చెప్పారు. బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత కెవి సింగ్‌దేవ్ కూడా మిశ్రా వాదనకు మద్దతు తెలిపారు. పర్సంటేజ్ కమీషన్ వ్యవస్థను నిర్మూలించలేమని, అవినీతిని అరికట్టడం సాధ్యమయ్యేది కాదని వ్యవసాయ మంత్రి దామోదర్ రౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. 17ఏళ్ల బిజెడి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టడం, తరువాత అంచనా వ్యయం పెంచేయడం జరిగిందని దేవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అడ్డూ అదుపూ లేకుండాపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.