జాతీయ వార్తలు

ఎయిర్‌పోర్టుల్లో ఇక పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలోని ప్రధాన పౌర విమానాశ్రయాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు దాదాపు 3 వేల మంది సిఐసిఎఫ్ జవాన్లను ‘హేతుబద్ధం’ చేసి వారి స్థానంలో అత్యధునాతన నిఘా పరికరాలను ఏర్పాటు చేయాలననే ప్రతిపాదనను అమలు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయ. విమానాశ్రయాల్లో సున్నితం కాని విధులనుంచి భద్రతా సిబ్బందిని తగ్గించి, ఇతర కీలకమైన బాధ్యతల్లో వారిని ఉపయోగించుకోవడానికి విమానాశ్రయాల్లో సెక్యూరిటీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్) ఒక భారీ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తుది చర్చలు, ఆమోదంకోసం హోం మంత్రిత్వ శాఖకు పంపించింది.
విమానాశ్రయాల్లో ఉపయోగంలోని ట్రాన్సిట్ గేట్లు, ప్రయాణికుల క్యూల నిర్వహణ, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ గేట్ల వద్ద కాపలా లాంటి ప్రధానమైన విధులనుంచి సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బందిని హేతుబద్ధం చేయడం లేదా తగ్గించడం గురించి ఈ పత్రంలో కూలంకషంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం 27 వేల మంది సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో దాదాపు 3వేల మందిని విమానాశ్రయం సెక్యూరిటీ విధులనుంచి తప్పించి వారి స్థానంలో అత్యాధునిక నిఘా పరికరాలు, సిసిటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలను ఏర్పాటు చేయాలని ఈ పత్రంలో సూచించినట్లు, ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోను ఇలాంటి ఆధునిక పరికరాల ద్వారా నిఘాను నిర్వర్తించడం జరుగుతోందని కూడా ఆ అధికారి చెప్పారు. అంతేకాదు, ఉగ్రవాద దాడులకు గురయ్యే ప్రమాదం ఉన్న కారణంగా దేశంలోని విమానాశ్రయాలకు ఇప్పుడు ఇలాంటి వ్యవస్థ అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రితపాదనను రూపొందించడానికి సిఐఎస్‌ఎఫ్ తాను విధులు నిర్వహిస్తున్న 59 పౌర విమానాశ్రయాల్లో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సర్వే జరిపిందని కూడా ఆయన చెప్పారు. ఉగ్రవాద, హైజాక్ ముప్పులనుంచి విమానాశ్రయాలకు ముప్పు ఎదురుకాకుండా చూడడానికి ప్రభుత్వం బహుళ స్థాయి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న దృష్ట్యా ఇలాంటి సర్వే అవసరమని కూడా ఆ అధికారి చెప్పారు. ఈ ప్రతిపాదన అమలు చేయడం వల్ల మిగిలిపోయే మ్యాన్‌పవర్‌ను భవిష్యత్తులో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ పరిధిలోకి వచ్చే పౌర విమానాశ్రయాలలో ఉపయోగించుకోవడం జరుగుతుందని కూడా ఆ అధికారి చెప్పారు.