జాతీయ వార్తలు

వంశధార ట్రిబ్యునల్ తుదితీర్పు నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: వంశధార నదీజలాల వివాదంపై తుది తీర్పు బుధవారం వెలువడనుంది. వంశధార నదీజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందం శర్మ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బోర్డు ఉదయం 11 గంటల అనంతరం తీర్పును ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2010లో సుప్రీం కోర్టు వంశధార నదీజలాల పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం జల వనరుల శాఖ వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం, వంశధార నదీ పరీవాహక రాష్ట్రాలైన ఆంధ్రా, ఒడిశాలను ప్రదివాదులుగా చేర్చింది. కేంద్రం తరపున సీనియర్ న్యాయవాది వసీం ఖాద్రి, ఆంధ్రనుంచి సీనియర్ న్యాయవాదులు వైధ్యనాథన్, రాజగోపాలరావు, ఒడిశానుంచి సీనియర్ న్యాయవాది మెహన్ కటార్కి ట్రిబ్యునల్ ముందు గతంలో వాదనలు వినిపించారు.