జాతీయ వార్తలు

ఆ ముగ్గురి ప్రభ వెలుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రస్తుత కేబినెట్‌లో ఆ ముగ్గురి ప్రభ వెలుగుతోంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లకు భద్రత, ఆర్థిక, రాజకీయ, పార్లమెంటరీ కేబినెట్ కమిటీల్లో బాధ్యతలు కల్పించటంతో కొత్త కేబినెట్‌లో ముగ్గురి ప్రాధాన్యం పెరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ భద్రతా కమిటీలో సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో ఇప్పుడు సభ్యురాలు. గత మార్చిలో మనోహర్ పారికర్ కేబినెట్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ శాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు సీతారామన్ రక్షణ శాఖను స్వీకరించటంతో కేబినెట్ భద్రతా కమిటీలో స్థానం దక్కింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురి మిగిలిన సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్విని తప్పించారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు వరకూ ఆయన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు. తాజాగా కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్‌కు స్థానం దక్కింది. ఆర్థిక, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలోనూ సీతారామన్, విజయ్ గోయల్‌కు స్థానం కల్పించడంతో కేబినెట్‌లో వారి ప్రాధాన్యత పెరిగినట్టయింది.