జాతీయ వార్తలు

డొల్ల కంపెనీలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో డొల్ల కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. డొల్లకంపెనీలు, వాటి అనుబంధం సంస్థలకు చెందిన 1.06 లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించింది. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా 2.09 లక్షల బోగస్ కంపెనీలపై వేటు పడింది. డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. డొల్ల కంపెనీల ఖాతాలపై ఓ కనే్నయాలని బ్యాంకులను కోరింది. కంపెనీల ప్రతినిధులు, డైరెక్టర్ల అకౌంట్లపై విచారణ జరపాలని ఆదేశించింది. 2013 కంపెనీల చట్టంలోని 164(2) సెక్షన్ కింద 1,06,578 మంది డైరెక్టర్లను గుర్తించి, అనర్హులుగా ప్రకటించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 164 సెక్షన్ కింద ప్రతి డైరెక్టర్ ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఐటి రిటర్న్ ఏటా దాఖలు చేయాలి. అలా చేయని పక్షంలో మళ్లీ డైరెక్టర్‌గా నియమించడానికి అర్హత కోల్పోతారు. అయితే దేశంలోని అనేక కంపెనీల్లో ఇవేవీ పాటించడంలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్ వద్ద నమోదైన 2.09 సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను కార్పొరేట్ మంత్రిత్వశాఖ సేకరిస్తోంది. ‘డైరెక్టర్ల ప్రొఫైల్స్, వారి గత చరిత్ర, పూర్వాపరాలు, కంపెనీలో నిర్వహిస్తున్న పాత్ర తదితర వివరాలపై ఆరా తీస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీలు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయా అన్న దానిపై కూడా దృష్టి సారించారు. కంపెనీల చట్టాన్ని కఠినంగా అమలుచేయడానికి చర్యలు చేపట్టింది. నిపుణులెవరు, చార్టర్డ్ అకౌంటెట్లెవరు, కాంపెనీ సెక్రెటరీలెవరు అన్నదానిపై కూడా కార్పొరేట్ మంత్రిత్వశాఖ దృష్టిపెట్టింది. డొల్ల కంపెనీల భరతం పడితే తప్ప నల్లధనాన్ని అరికట్టలేమని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి స్పష్టం చేశారు. బోగస్ కంపెనీలను కట్టడి చేయడానికి సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీసు, ఆర్‌ఓసి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌లను రంగలోకి దించారు. డొల్ల కంపెనీలు, డైరెక్టర్లకు సంబంధించి ఈనెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు.