జాతీయ వార్తలు

రాష్ట్రంలో మినీ జపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌తోసహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లో జపాన్ పారిశ్రామిక పట్టణాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ముంబాయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు నిర్మాణానికి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబెలు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాల్లో జపాన్ పారిశ్రామిక పట్టణాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో జపాన్ పారిశ్రామిక పట్టణాలను నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేయటం కూడా జరిగిందని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే జపాన్ పారిశ్రామిక పట్టణాల్లో మినీ జపాన్‌లు ఆవిర్భవిస్తాయని ఆయన తెలిపారు. ఈ పట్టణాల్లో జపాన్ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించటంతోపాటు వాటిలో పనిచేసే జపాన్ పౌరులకోసం నివాస సముదాయాలు, హోటళ్లు, మాల్స్, జపాన్ కళా కేంద్రాలు, వినోద కేంద్రాలను కూడా నిర్మిస్తారు. జపాన్ పారిశ్రామిక పట్టణాల్లో మొత్తం వ్యవస్థ అంతా జపాన్ పద్ధతిలో ఉంటుందని చెబుతున్నారు. జపాన్ పారిశ్రామిక పట్టణాలను ఆనుకుని ఇతర పట్టణాలను అభివృద్ది చేసే ఆలోచన కూడా ఉన్నదని చెబుతున్నారు.